- 'హైదరాబాద్ - విజయవాడ మధ్య హైస్పీడ్ రైలుతో విస్తృత అభివృద్ధి'
హైదరాబాద్ - విజయవాడ మధ్య హైస్పీడ్ రైలు కోసం తమ వంతు కృషి చేస్తామని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రెండు నగరాల మధ్య హైస్పీడ్ రైలు వస్తే హైవే వెంట అభివృద్ధి జరిగి ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజకీయ లబ్ధి కోసమే..
రాజకీయ లబ్ధి కోసమే వైకాపా ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేసిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఈ ఏడాది కాలంలో వైకాపా ప్రభుత్వం పరిశ్రమల కోసం ఏమి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మంత్రి బొత్స సోదరుడే చేస్తున్నాడు...!
మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు ఆదిబాబు తమ స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని విజయనగరంలో కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కంచె, స్తంభాలను ఏర్పాటు చేశారని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొద్దిరోజుల్లో రఫేల్ జెట్స్..
సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారతీయులకు శుభవార్త అందింది. వాయుసేన ఎంతగానో ఎదురుచూస్తున్న అత్యాధునిక ఆరు రఫేల్ యుద్ధ విమానాలు జులై 27నాటికి భారత్‌కు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సముద్రంలోనూ చైనా కుట్రలు
హిందూ సముద్ర ప్రాంత(ఐఓఆర్) భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి నిపుణులు సూచించారు. వాస్తవాధీన రేఖ వెంబడే కాకుండా ఐఓఆర్ ప్రాంతంలోనూ తన స్థావరాలను విస్తరించుకోవడానికి చైనా దృష్టిసారించిందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్మా థెరపీ..
మహారాష్ట్రలో భారీ ప్లాస్మా థెరీపీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్మా ప్రాజెక్ట్ అని రాష్ట్ర వైద్య విద్యా విభాగ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ట్రంప్‌పై అరెస్ట్ వారెంట్ జారీ..
తమ టాప్ కమాండర్ సులేమానీ హత్య ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా మరో 30మందిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇరాన్. ట్రంప్‌ను అదుపులోకి తీసుకునేందుకు సహకరించాలని ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టెస్టు ఛాంపియన్ షిప్‌పై నిర్ణయం..!
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ షెడ్యూల్‌పై సమీక్ష జరుపుతున్నట్లు తెలిపింది ఐసీసీ. అక్టోబర్ నాటికి దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏడు' శుభవార్తలు..
బాలీవుడ్లో ప్రముఖ నటీనటులతో తెరకెక్కిన ఏడు సినిమాలు త్వరలో డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆ స్టార్స్ వెల్లడించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కూరగాయలు అమ్ముతున్న ఆమిర్‌ఖాన్ సహనటుడు
ప్రముఖ కథానాయకుడు ఆమిర్ ఖాన్‌తో కలిసి నటించిన జావేద్ హైదర్.. ముంబయిలో కూరగాయలు అమ్ముతూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.