- వన్ టైం సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్లు వేగంగా పూర్తి చేయాలి: సీఎం జగన్
CM Review on Revenue Department: పేరుకుపోయిన పన్ను బకాయిల వసూలుకు వన్ టైం సెటిల్ మెంట్ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రొఫెషనలిజం పెంచడం ద్వారా రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకురావాలని ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
- 37 మంది తెదేపా కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు..4 వేలకు పైగా అక్రమ కేసులు: చంద్రబాబు
Babu Comments: వైకాపా పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా ఉండే రాష్ట్రాన్ని మూడేళ్లలో వల్లకాడు చేశారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు సంబంధీకులను చంపేస్తారని ముందునుంచి చెబుతూనే ఉన్నామని..,తాము చెప్పినట్లే జరగుతోందని అన్నారు.
- జనసేన అధినేత పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటన.. ముహూర్తం ఖరారు
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు మహూర్తం ఖరారైంది. అక్టోబరు 5న విజయదశమి రోజున తిరుపతి నుంచి పర్యటన ప్రారంభించి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
- 'సోము వీర్రాజుకు రక్షణ కల్పించండి'.. డీజీపీకి భాజపా నేతల వినతి
BJP leaders meet DGP: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు రక్షణ కల్పించాలని ఆ పార్టీ నేతలు డీజీపీకి వినతిపత్రం అందజేశారు. కోనసీమ అల్లర్లతో సంబంధం లేని యువమోర్చా నాయకుడి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడాన్ని తప్పుబట్టారు. భాజపా జాతీయ అధ్యక్షుడి రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంతోనే వైకాపా ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తుందని అన్నారు.
- 'నుపుర్, జిందాల్‌ను అరెస్టు చేయాల్సిందే'.. అనేక చోట్ల నిరసనలు, హింస
మత ప్రబోధకుడిపై భాజపా మాజీ నేతలు చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్, బంగాల్లో నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆందోళన కారులను అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులకు గాయాలయ్యయి. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
- 'మా నాన్న ఎవరో తెలుసా?'.. ఎమ్మెల్యే కుమార్తె రగడ.. పోలీసులతో ఫైట్!
ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఓ భాజపా ఎమ్మెల్యే కుమార్తె కారును ఆపినందుకు పోలీసులతో ఆమె తీవ్ర వాగ్వాదానికి దిగింది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల ఆమె తండ్రి పోలీసులకు క్షమాపణలు తెలిపారు. ఆమెకు విధించిన జరిమానాను కూడా చెల్లించారు.
- పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు తీవ్ర అస్వస్థత
తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్(78) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ముషారఫ్ గత 3 వారాలుగా దుబాయ్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ముషారఫ్‌కు వెంటిలేటర్ తొలగించారని, ఆయన పరిస్థితి కోలుకోవడం సాధ్యం కానంత క్లిష్ట స్థితిలో ఉందని వెల్లడించారు.
- ఈ వికెట్కీపర్లు కెప్టెన్లుగానూ అదుర్స్.. స్కెచ్ వేశారంటే..
క్రికెట్లో వికెట్ కీపర్లకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా సందర్భాల్లో తమ వికెట్ కీపింగ్ నైపుణ్యంతో మ్యాచ్‌లను ములుపు తిప్పారు. అలాంటి ఆటగాళ్లలో కొందరు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చెప్పట్టి జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించారు. మరి ఆ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందామా..
- మార్కెట్లకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 1017 పాయింట్లు డౌన్.. రూపాయి @ ఆల్‌టైం లో!
Stock Markets: దేశీయ మార్కెట్లు ఈ వారాంతాన్ని భారీ నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలకు తోడు కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 1000పైగా పాయింట్లు నష్టపోయింది. మరోవైపు.. రూపాయి మరింత దిగజారి జీవితకాల కనిష్ఠానికి చేరింది.
- సల్మాన్‌కు బెదిరింపులే కాదు.. హత్యకు కుట్ర.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..
సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల కేసులో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సల్మాన్‌కు కేవలం బెదిరింపులే కాదని, అతడిని చంపేందుకు కుట్ర జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అరెస్టైన సిద్ధేశ్ కాంబ్లే మరిన్ని షాకింగ్ విషయాలను పోలీసు దర్యాప్తులో బయటపెట్టాడు.