- నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ముఖ్యమంత్రి జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన కేంద్రీకృత వంటశాలను సీఎం ప్రారంభించనున్నారు.
- గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై నేడు ప్రత్యేక సమావేశం
Godavari-kaveri river connection : ఐదు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో నేడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై చర్చించనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3గంటలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్లో భేటీ జరగనుంది.
- Donation to TTD: తితిదేకు భారీ విరాళాలు.. ఉదయాస్తమానం ద్వారా రూ.85 కోట్లు.. ఓ కుటుంబం రూ.9.20 కోట్లు
ఉదయాస్తమాన సేవా టికెట్ల ద్వారా రూ.85 కోట్లు విరాళాలు వచ్చాయని తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే ఓ కుటుంబం స్వామివారికి భారీ ఎత్తున విరాళం అందజేసినట్లు చెప్పారు.
- Governor Visakha Tour: 20న విశాఖకు గవర్నర్ బిశ్వభూషణ్
governor visakha tour : గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 20 నుంచి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 21న జరగనున్న ప్రెసిడెన్సియల్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు పాల్గొంటారు.
- యూపీలో భాజపా 'సురక్ష' నినాదం గెలిపిస్తుందా?
ఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన పలు ఘటనలను ఎన్నికల ప్రచారంలో భాజపా పదేపదే గుర్తు చేస్తోంది. సురక్ష నినాదాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. దీనిని భాజపా ప్రధానాశ్రంగా చేసుకుని యూపీ ఎన్నికల్లో ముందుకు వెళ్తోంది.
- punjab assembly election: అంతర్గత కలహాలే.. అసలు సవాల్
punjab assembly election: పంజాబ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు సిద్ధూ, సీఎం చరణ్‌జీత్‌సింగ్ చన్నీ శిబిరాల మధ్య విభేదాలు అతిపెద్ద సవాళ్లుగా మారాయి. ఆ రెండు వర్గాలు సహకరించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిద్ధూ వైఖరి.. కాంగ్రెస్ గెలుపుపై ప్రభావం చూపుతుందా? ప్రత్యర్థులు స్వపక్ష నేతలే ఎందుకయ్యారు. ‘ఒక కుటుంబానికి ఒకటే టికెట్’ విధానం తెచ్చిన తంట ఏంటి?
- Ukraine crisis: ఉక్రెయిన్-రష్యా వివాదం.. భారత్ కీలక వ్యాఖ్యలు
Ukraine crisis: ఉక్రెయిన్-రష్యాల మధ్య ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించే పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు యూఎన్‌లో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి. ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న వేళ సత్వర, నిర్మాణాత్మక దౌత్యం అవసరమని చెప్పారు.
- క్రిప్టో కరెన్సీలో మదుపు చేయాలనుకుంటున్నారా? అయితే ఇవి తెలుకోండి!
cryptocurrency: క్రిప్టో కరెన్సీపై వచ్చిన ఆదాయానికి పన్ను విధిస్తున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో ఈ డిజిటల్ ఆస్తులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. పన్ను పరిధిలోకి తీసుకురావడం ద్వారా వీటిని నిషేధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని కొంత మేరకు గ్రహించవచ్చు. వాటికి చట్టబద్ధత కల్పించే విషయంలో స్పష్టత ఇప్పటికీ రాలేదు. రోజుకో కొత్త క్రిప్టో కరెన్సీలు వస్తున్న నేపథ్యంలో వీటిలో మదుపు చేసేముందు తెలుసుకోవాల్సిన అంశాలేమిటో చూడండి..
- Dubai Tennis Championships: సెమీఫైనల్లోకి సానియా జోడీ
Dubai Tennis Championships: దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌లో సానియా మీర్జా- లూసీ హర్దెకా జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో షుకో- అలెక్సాండ్రా క్రునిక్ ద్వయంపై విజయం సాధించింది.
- 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. ట్రైలర్ తేదీ ఫిక్స్..!
Sharwanand Adavallu meeku joharlu movie: శర్వానంద్, రష్మిక కలిసి నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ట్రైలర్‌ను ఈనెల 19న విడుదల చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 6:03గంటలకు మూడో లిరికల్ గీతాన్ని విడుదల చేయనుంది చిత్రబృందం.