- 'రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.7171 కోట్లు జమ'
రాష్ట్రంలో 12 శాతం అదనపు విద్యుత్ ఉత్పత్తి ఉందని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం చెప్పారు. విద్యుత్ విషయమై కేంద్రం అన్ని రాష్ట్రాలకు ముసాయిదా పంపిందన్న కల్లం... ప్రతి రాష్ట్రం రాయితీలను నేరుగా వినియోగదారులకు అందజేయాలనేది ప్రతిపాదన అని వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ప్రజల కోసం పోరాడుతున్నారనే కేసులు పెట్టారు'
ప్రజల కోసం పోరాడుతున్నారనే తెదేపా నేతలపై కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడిని చంద్రబాబు పరామర్శించారు. విజయవాడ కరెన్సీనగర్‌లోని అచ్చెన్నాయుడు నివాసంలో ఆయనను కలిశారు. ఎంపీ కేశినేని నాని, ఇతర నేతలు అచ్చెన్నాయుడిని పరామర్శించిన వారిలో ఉన్నారు. అనంతరం చంద్రబాబు కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లారు. విజయవాడలోని కొల్లు రవీంద్ర నివాసంలో పరామర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఏపీ: మరో 10, 392 మందికి కరోనా... 4,55,531కు పెరిగిన బాధితులు
నేడు కూడా రాష్ట్రంలో పది వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా నివేదిక ప్రకారం.. మరో 10 వేల 392 మంది కోవిడ్ బారిన పడ్డారు. వీరితో కలిపి కేసుల సంఖ్య 4 లక్షల 55 వేల 531కు పెరిగింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి మృతుల సంఖ్య 4,125 కు చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మాస్కు లేకుంటే మెట్రోలోకి నో ఎంట్రీ
దేశవ్యాప్తంగా సెప్టెంబరు 7నుంచి మెట్రో సేవల పునరుద్ధరణకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేశారు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి. ప్రయాణికులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్లలోని స్టేషన్లు మూసే ఉంటాయని వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ''చైనాకు భారత్ షాక్' వార్తలు అవాస్తవం'
పాంగాంగ్ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని సైనికాధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త మోహరింపులో భాగంగా ఆగస్టు 30న కొన్ని చోట్ల సైనికుల పహారాలో మార్పులు చేర్పులు చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ప్రపంచదేశాల్లో ఆగని కరోనా ఉద్ధృతి
ప్రపంచ దేశాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 2 కోట్ల 60 లక్షలకు చేరువైంది. దాదాపు 8 లక్షల 62 వేల మంది కరోనాతో మృతి చెందారు. భారత్, అమెరికా,బ్రెజిల్, రష్యా దేశాలు సహా కొలంబియా, మెక్సికో, పెరూ, దేశాల్లోనూ కొవిడ్ బాధితులు భారీగానే పెరుగుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'సౌదీ చారిత్రక నిర్ణయం.. అన్ని దేశాల విమానాలకు అనుమతి'
యూఏఈకి వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానాలను తమ గగనతలం మీదగా వెళ్లేందుకు అనుమతించింది సౌదీ అరేబియా ప్రభుత్వం. యూఏఈ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్' కార్యకలాపాలు షురూ
వాల్‌మార్ట్ ఇండియాను కొనుగోలు చేసిన అనంతరం 'ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్' పేరుతో మూడు నగరాల్లో కార్యకలాపాలను ప్రారంభించింది ఫ్లిప్‌కార్ట్. ఈ ఏడాది చివరికి మరో 20నగరాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'అమ్మో.. దుబాయ్ వేడిలో అతి సాధన వద్దు'
దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది. ఇప్పటికే చెన్నై తప్ప అన్ని జట్లు ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నాయి. అయితే ఆటగాళ్లకు అతి సాధన వద్దని అభిప్రాయపడ్డారు దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సుశాంత్ కేసులో దర్యాప్తు సంస్థల అప్డేట్స్ ఇవే..
సుశాంత్ కేసు విచారణలో భాగంగా రియా తండ్రి ఇంద్రజిత్, సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్‌లను సీబీఐ నేడు విచారించింది. డ్రగ్స్ కేసులో అద్బుల్ బాసిత్ పరిహార్, జైద్ విలత్రాలను ఎన్సీబీ అరెస్టు చేశారు. వరుణ్ మాథుర్ ఈడీ ఎదుట హాజరయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి