ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - trending news

.

TOP NEWS @ 9 PM
ప్రధాన వార్తలు @ 9 PM
author img

By

Published : Jul 12, 2020, 9:02 PM IST

  • 1933 కరోనా కేసులు...19 మరణాలు

రాష్ట్రంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 30 వేలకు చేరువలోకి వచ్చింది. గత 24 గంటల్లో (శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 వరకు) రికార్డు స్థాయిలో 1,933 కరోనా కేసులు నమోదయ్యాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • పోలవరాన్ని పూర్తి చేసేది సీఎం జగనే

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేది సీఎం జగనే అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సకాలంలో ప్రాజెక్టు పనులను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • జగన్​ది ఇల్లా.. మాయా మహలా?

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ప్రజాధనంతో వృథా ఖర్చులు చేయడం మాని.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • రైతు దగా పథకంగా మార్చండి

సున్నా వడ్డీ పంట రుణాల పథకంతో పేరుతో రైతులను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జీవో 4530 తెచ్చి వేలాది మంది రైతులను ముంచారని ధ్వజమెత్తారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • తెలంగాణ రాజ్​భవన్​లో 28 మంది పోలీసులకు కరోనా

తెలంగాణ రాజ్ భవన్ సిబ్బందిని కరోనా.. కలవరపాటుకు గురి చేస్తోంది. అక్కడ పని చేసే 28 మంది పోలీసులతో పాటు.. సిబ్బందిలో 10 మందికి.. వారి కుటుంబీకులు మరో 10 మందికి వైరస్ సోకింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 'మహా' విజృంభణ

భారత్​లో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. వైరస్​ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో 24 గంటల్లోనే 7వేల 827మందికి వైరస్​ సోకింది. మరో 173మంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కేంద్రం రివర్స్ గేర్​!'

కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న ప్రస్తుత సమయంలో ఇటీవల కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. మాస్క్​లు, శానిటైజర్లను నిత్యవసరాల జాబితా నుంచి తొలగించడం విమర్శలకు తావిచ్చింది. కరోనా వ్యాప్తి ఆరంభ దశలో ధరలు నియంత్రించిన కేంద్రం.. 4 నెలల గడవక ముందే ఎందుకు వైఖరి మార్చుకుంది? ఈ నిర్ణయాన్ని నిపుణులు ఎలా విశ్లేషిస్తున్నారు?

  • క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​ వ్యాక్సిన్​ కోసం వివిధ దేశాలు విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా శుభవార్త​ అందించింది. కరోనా వైరస్​ వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​ విజయవంతంగా పూర్తిచేసినట్లు సెచెనోవ్​ విశ్వవిద్యాలయం ప్రకటించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • క్రీడల నిర్వహణపై రిజిజు సమావేశం

దేశంలో త్వరలోనే క్రీడాకార్యక్రమాలు పునరుద్ధరించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. క్రీడా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్రాల అధికారులతో కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం ఈ నెల 14 నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఇదే రోజు మళ్లీ పుట్టా

'ఆర్​ఎక్స్ 100' సినిమాకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో కార్తికేయ ఎమోషనల్​ ట్వీట్ చేశారు. ఈరోజును తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.