ETV Bharat / city

ప్రధాన వార్తలు @9AM - breaking news

.

ప్రధాన వార్తలు @9AM
ప్రధాన వార్తలు @9AM
author img

By

Published : Jan 3, 2021, 8:59 AM IST

  • టీకా వినియోగంపై నేడు డీసీజీఐ కీలక ప్రకటన

దేశంలో కరోనా టీకా వినియోగం, అనుమతుల విషయంపై నేడు కీలక ప్రకటన చేయనుంది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ). ఉదయం 11 గంటలకు డీసీజీఐ డైరెక్టర్ జనరల్ మీడియాతో మాట్లాడనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఉద్రిక్త తీర్థం

ప్రశాంత రామతీర్థం క్షేత్రం... రాజకీయ రణరంగంలా మారింది. అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ నిరసనలతో ఆ ప్రాంతమంతా నిప్పులు రాజుకున్నాయి. వైకాపా, తెలుగుదేశం, భాజపా శ్రేణుల ప్రదర్శనలు సహా.... చంద్రబాబు, విజయసాయిరెడ్డి పర్యటనలు... అక్కడ మరింత ఉద్రిక్తతకు దారితీసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • నేడు మంత్రులు బొత్స, వెల్లంపల్లి

రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటనాస్థలిని నేడు మంత్రులు బొత్స సత్యనారాయాణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు సందర్శించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • దేవుళ్ల ఆస్తుల జోలికొస్తే మసే

వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైకాపా 19నెలల పాలనలో 127 ఆలయాలపై దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాలను కాపాడే బాధ్యత సీఎం జగన్​కు లేదా అని ప్రశ్నించారు. విజయనగరం పర్యటనకు వచ్చిన సీఎం... రామతీర్థం ఆలయానికి వచ్చే బాధ్యత లేదా అని నిలదీశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రేపటి నుంచే పోలీస్ డ్యూటీ మీట్

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న పోలీస్‌ డ్యూటీమీట్‌ కోసం తిరుపతి ముస్తాబవుతోంది. జనవరి 4 నుంచి 7 వరకూ నిర్వహించనున్న ఈ రాష్ట్ర స్థాయి పోటీల కోసం పోలీస్‌ ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా బలగాల విన్యాసాలు, ఆయుధసంపత్తి, సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అత్యవసర వినియోగానికి.. కొవాగ్జిన్‌కూ అనుమతి!

కరోనా వైరస్​ను అరికట్టేందుకు దేశీయంగా రూపొందించిన 'కొవాగ్జిన్​' వ్యాక్సిన్​కు నిపుణుల కమిటీ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ మేరకు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. అయితే.. కొవాగ్జిన్‌పై మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలను కొనసాగించాలని భారత్‌ బయోటెక్‌కు నిపుణుల బృందం సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కార్యాలయాల్లో కునుకుతీస్తే ఇక వేటే!

కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అప్పుడప్పుడూ కునుకు తీస్తున్నారా? పై అధికారులు, ఇతర సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారా? అయితే.. ఇకపై అలాంటివి మానుకోవాల్సిందే. అవును.. నిజమే. విధి నిర్వహణలో ఉద్యోగి నిద్రపోవడం దుష్ప్రవర్తన కిందకే వస్తుందని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ఇలాంటి 23 వ్యవహారాలను ప్రవర్తనా నియమావళి కింద పేర్కొంటూ.. ముసాయిదా రూపొందించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆ దిగ్గజ నటుల భవంతుల్ని కొననున్న పాక్​

దిగ్గజ నటులు దిలీప్​ కుమార్​, రాజ్​కపూర్​ల భవంతుల్ని కొనుగోలు చేసేందుకు పాక్​ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండు భవనాలకు కలిపి రూ.2.35 కోట్లు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రోహిత్​.. ఎక్కడ ఆడతాడు? వేటు ఎవరిపై?

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్​ఇండియాకు మరో చిక్కొచ్చిపడింది. క్వారంటైన్​ ముగించుకుని, వైస్​ కెప్టెన్​గా నియమితుడైన రోహిత్​ శర్మను ఏ స్థానంలో ఆడించాలా అని? ఈ విషయమై మేనేజ్​మెంట్ ప్రస్తుతం ఆలోచన చేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ''రెడ్'.. రీమేక్​ సినిమాలా అస్సలు అనిపించదు'

త్వరలో 'రెడ్' విడుదల కానున్న సందర్భంగా చిత్రవిశేషాలు పంచుకున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. చూస్తున్నంతసేపు ఎక్కడా రీమేక్​లా అనిపించదని చెప్పారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.