- " class="align-text-top noRightClick twitterSection" data="">
- Corona: కరోనా నుంచి కొలుకున్న తగ్గని ఇతర సమస్యలు
కరోనాను జయించిన తర్వాత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగుల కోసం తిరుపతి స్విమ్స్, రుయా ఆసుపత్రుల్లో పోస్ట్ కొవిడ్ వార్డులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఓపీ సేవలు అందిస్తూ.. రోగుల మానసిక పరిస్థితిని సైతం పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - Flash: బీచ్‌లో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతు.. ముగ్గురు మృతి
శ్రీకాకుళం కవిటి మండలం పుక్కల్లపాలెం బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా..మరొకరి కోసం గాలింపు చేపట్టారు. సముద్ర తీరంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా విషాదం జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - అన్నమాచార్య సంకీర్తన అన్వేషణ సాగించిన చాగంటి
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ... అన్నమాచార్యుడు గాత్రం చేసిన కీర్తనలు మధురాతి మధురం. అందులో చాలా కీర్తనలు ఇప్పటికీ శ్రీనివాసుడి భక్తులను అలరిస్తున్నాయి. అయితే అంతగా ప్రాచుర్యం పొందని వాటికి అర్థం చెబుతూ, దృశ్యరూపమిస్తున్నారు విశాఖకు చెందిన చాగంటి సోమసుందర్రావు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - ఇంటి ప్రాంగణాన్నే చిట్టడవిగా మార్చిన వైద్యుడు
ఆ ఇంట్లోకి ప్రవేశించగానే పచ్చదనం స్వాగతం పలుకుతుంది. ఆహ్లాదాన్నిచ్చే మొక్కలు ఆకాశం నుంచి ఆశీర్వదించే చెట్లూ ఉంటాయక్కడ. రంగురంగుల పూలమొక్కలు, పక్షుల కిలకిలరావాలు మనసుకు హాయినిస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - యూపీపై ఎంఐఎం గురి- 100 సీట్లలో పోటీ
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అక్కడి చిన్న పార్టీలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - పిల్లలకు టీకాపై ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారితో పిల్లల చదవుకు తీరని నష్టం వాటిల్లిందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. చిన్నారుల కోసం కొవిడ్ టీకా వస్తే పాఠశాలలు పునఃప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - త్వరలోనే ఆ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ?
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కార్యదర్శుల నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్యానెల్ ఇటీవల సమావేశమై.. ప్రైవేటీకరణకు ఎదురయ్యే సమస్యలను గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - శాంసంగ్ కొత్త ఫోన్ ఫీచర్స్ లీక్- ధరెంతంటే..
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త. శాంసంగ్ గెలాక్సీ ఏ22 పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. అయితే.. ఈ ఫోన్ ధర, ఫీచర్లు తాజాగా లీక్ అయ్యాయి. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - Tokyo Olympics: 'పతకాలు గెలవడానికే ఒలింపిక్స్‌కు..'
భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌కు వెళ్లేది కేవలం ఆడటానికే కాదని.. కచ్చితంగా పతకాలు సాధిస్తారని కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. ఆటగాళ్ల గురించి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రస్తావించడం గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - MAA Elections: రసవత్తరంగా 'మా'రిన ఎన్నికలు
తెలుగు నటీనటుల సంఘం ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలో నలుగురు నటీనటులు పోటీ చేస్తుండగా... తాజాగా సీనియర్ నటులు సీవీఎల్ కూడా అధ్యక్ష పోటీకి సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.