- తిరుపతి ఉప ఎన్నిక..ప్రధాని పాలనకు రెఫరెండం: చింతా మోహన్
చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో తిరుపతి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ ప్రచారం నిర్వహించారు. ఈ ఉప ఎన్నిక ప్రధాని మోదీ పాలనకు రెఫరెండమని ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అప్పుల బాధతో ఓకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం!
పశ్చిమగోదావరి జిల్లా కెఎస్ రామవరంలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్థులు ఇచ్చిన వివరాల మేరకు అప్పుల బాధలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు
శ్రీశైలం మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ పూజలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు భృంగి వాహన సేవ జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏటీఎంలో అగ్నిప్రమాదం..మిషన్లు, ఏసీలు దగ్ధం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏటీఎంలో మంటలు చెలరేగాయి. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఏటీఎం, ఏసీలు కాలి బూడిదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రక్తపాతం మధ్య బంగాల్ నాలుగో విడత పోలింగ్
హింసాత్మక ఘటనల మధ్య బంగాల్ శాసనసభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ముగిసింది. కూచ్ బిహార్ జిల్లా సితాల్‌కుచిలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ నెల 20న అసోంలో రీపోలింగ్
అసోంలో రీపోలింగ్ తేదీని ప్రకటించింది ఈసీ. ఏప్రిల్ 20న మూడు నియోజకవర్గాల్లోని నాలుగు కేంద్రాల్లో ఎన్నికలు జరపనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వైరస్ కట్టడికి.. లాక్డౌన్ కన్నా అదే మేలు'
కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ కన్నా గుంపులుగా తిరగకపోవడం, భౌతిక దూరం పాటించడమే కీలకమని డబ్ల్యూహెచ్ఓ అధికారి డా.పూనమ్ సింగ్ అన్నారు. పరీక్షలు, చికిత్సను పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వృద్ధి కోసం భారత్ వేగం పెంచాలి'
కరోనా నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలి అంటే మరో బలమైన ఉద్దీపన ప్యాకేజీ అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి తెలిపింది. ఈ ఏడాదికిగాను భారత్ జీడీపీ 12.5 శాతం ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన ఐఎంఎఫ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒలింపిక్స్‌కు మరో ఇద్దరు మహిళా రెజర్లు అర్హత
ఆసియా క్వాలిఫయర్స్‌లో అదరగొట్టిన భారత మహిళా రెజ్లర్లు అన్షు, సోనమ్.. టోక్యో ఒలింపిక్స్ బెర్తులను ఖరారు చేసుకున్నారు. వీరికి కేంద్రమంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా సోకి 'మహాభారతం' నటుడు మృతి
'మహాభారతం' సీరియల్ ఫేమ్ సతీష్ కౌల్(ఇంద్రుడు) కరోనాతో పోరాడుతూ మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.