ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - ap top ten news

.

TOP NEWS @ 7 PM
ప్రధాన వార్తలు @ 7 PM
author img

By

Published : Feb 27, 2021, 7:01 PM IST

  • వాళ్లే ఆకు రౌడీలు: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

తాను ఆకు రౌడీనంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులే ఆకు రౌడీలని, పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అంటూ ఘాటుగా బదులిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • లేఖలు రాస్తేనే సరిపోదు: సీపీఐ నారాయణ

స్టీల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేవలం లేఖలు రాస్తే సరిపోదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విజ్ఞాపనలతో పనికాదని.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిందేనన్నారు. కేంద్రం బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తుందని నారాయణ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • వామపక్షాల సంపూర్ణ మద్దతు...

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5న తలపెట్టిన... బంద్‌కు వామపక్షాలు మద్దతు పలుకుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే మార్గంగా రాష్ట్ర బంద్‌ సాగుతుందన్నారు. ప్రజలంతా బంద్‌ను జయప్రదం చేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'శ్రీవారి ఆలయానికి భూమి ఇవ్వాలని కోరతాం'

అయోధ్యలో శ్రీవారి ఆలయానికి భూమి ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని సుబ్బారెడ్డి అన్నారు. తితిదే 2021-2022 సంవత్సరానికి 2,937.82 కోట్ల రూపాయల అంచనాతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • అప్రమత్తత అవసరం..

రాష్ట్రాలు కొవిడ్​ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'చైనాను చూసి మోదీ భయపడుతున్నారు'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చైనాను చూసి భయపడుతున్నట్లు కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ ఆరోపించారు. భారత్​-చైనా సరిహద్దు వివాదంపై మాట్లాడిన రాహుల్​.. ప్రధాని అసమర్థత కారణంగానే భారత్​ భూభాగంలోకి డ్రాగన్ వచ్చిందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సమస్యల పరిష్కారానికి సిద్ధం: ఇమ్రాన్

నియంత్రణ రేఖ వెంబడి శాంతి నెలకొల్పే దిశగా భారత్-పాక్ తీసుకున్న నిర్ణయాన్ని పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. భారత్-పాక్ నిర్ణయం నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద నిరోధక చర్యలు ఆగవని ఉత్తర కమాండర్ లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషి అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'తీర్మానంపై భారత్​కే అధికారం'

బంగ్లాదేశ్​లో తలదాచుకుంటున్న 11 లక్షల మంది రోహింగ్యాలను స్వస్థలానికి పంపించే తీర్మానంలో ఎక్కువ అధికారం భారత్​కే ఉందని ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్​ తిరుమూర్తి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • చివరి టెస్టుకు పిచ్​లో మార్పులు..​!

మొతేరా పిచ్​పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తదుపరి మ్యాచ్​కు బ్యాటింగ్​కు అనుకూలించేలా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్​ జట్టు అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ.. ఐసీసీ దృష్టిలో పడకుండా.. బీసీసీఐ ఈ మార్పులు చేయొచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • అనసూయ మాస్ గీతం.. కేక పెట్టిస్తున్న స్టెప్పులు!

అనసూయ నర్తించిన స్పెషల్ సాంగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమె స్టెప్పులు అభిమానుల్ని అలరిస్తూ గీతంపై ఆసక్తి పెంచుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.