- Chandrababu: రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదని మరోసారి రుజువైంది: చంద్రబాబు
Chandrababu: రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మచిలీపట్నంలో నాగలక్ష్మి ఆత్మహత్యతో ఈ విషయం మరోసారి రుజువైందని ధ్వజమెత్తారు.
- అలా చేయాలని సీనియర్ల ర్యాగింగ్.. ఎన్ఎంసీకి విద్యార్థి ఫిర్యాదు..!
Raging in guntur medical college: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థులు.. ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు యూజీ విద్యార్థులు నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. తమను పొడుగు చొక్కాలు ధరించాలని ఆంక్షలు పెడుతున్నారని పేర్కొన్నారు.
- ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. అప్పట్నుంచే
TTD Tickets: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆన్లైన్, సిఫార్సు లేఖలు, ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో ఆర్జిత సేవల టికెట్లు జారీ చేస్తామని తెలిపారు.
- మార్కాపురం జిల్లాకోసం రెండవ రోజు ఆమరణ దీక్ష..
Initiation for Markapuram District : మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. వెనుక బడిన పశ్చిమ ప్రాంతాన్ని జిల్లా చేయాలంటూ.. గత 37 రోజులుగా ఇక్కడి ప్రజలు ఉద్యమబాట పట్టారు.
- అమ్మవారే ఇంటింటికీ వెళ్తారు.. ఇదే అక్కడి ప్రత్యేకత..!
Goddess Nancharamma: సాధారణంగా కష్టాలు, బాధలు చెప్పుకొనేందుకు భక్తులు ఆలయానికి వెళుతుంటారు. కానీ ఆ గ్రామంలో మాత్రం.. అమ్మవారే ఊళ్లోని ప్రతి గడపా తొక్కుతారు. ఇంటింటికీ వెళ్లి పూజలు అందుకుంటారు. భక్తుల కోర్కెలు తీర్చుతారు. ఇంతకీ ఆ దేవత ఎవరు..? ఎక్కడ వెలిశారు..? ఏమిటి ఆ గ్రామ ప్రత్యేకత..? తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే.
- అగ్గిపెట్టెల లారీ దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్
Lorry catches fire in vishakapatnam: విశాఖ జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద అగ్గిపెట్టెల లారీ దగ్ధమైంది. తమిళనాడు నుంచి బిహార్ వెళ్తున్న అగ్గిపెట్టెల లారీని.. ఎదురుగా వస్తున్న వాహనం తాకుతూ వెళ్లటంతో ప్రమాదం చోటు చేసుకుంది.
- కారు బీభత్సం.. పసికందు మృతి.. వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్..!
Car Accident at Jubilee hills: తెలంగాణ రాజధాని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గురువారం రాత్రి ఓ కారు సృష్టించిన బీభత్సానికి 2 నెలల పసికందు బలైంది. దుర్గంచెరువు కేబుల్ వంతెన నుంచి రోడ్ నంబర్ 45కు వెళ్తున్న కారు.. బెలూన్లు అమ్ముకునే ముగ్గురు మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళలతో పాటు ఏడాది చిన్నారికి గాయాలయ్యాయి. రెండున్నర నెలల బాబు మృతి చెందాడు. కారుపై బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
- ఆ రోజే చివరి తేదీ.. ఆదాయపు పన్ను లెక్క చూసుకోండి
Aadhar pan link last date: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల మార్చి 31తో ముగియనుంది. ఈ గడువులోపు ఆదాయపు పన్ను విభాగం నిబంధనల మేరకు అందరూ తమ పాన్, ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోతే ఏం అవుతుంది. పన్ను మినహాయింపు కోసం ఏం చేయాలి?
- MS Dhoni Jersey No: నా లక్కీ నంబర్ 7 కాదు: ధోనీ
MS Dhoni Jersey No: తన జెర్సీ నంబర్ ఎంపికకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులతో ముచ్చటించిన ధోనీ.. దీనికి గల కారణాన్ని వారితో పంచుకున్నాడు.
- Salute movie review: పోలీస్‌గా దుల్కర్ ఆకట్టుకున్నాడా?
Salute movie review: మలయాళంతో పాటు, తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ . ఇప్పటికే ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. తాజాగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో దుల్కర్ నటించిన చిత్రం 'సెల్యూట్'. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ వేదికగా శుక్రవారం విడుదల అయ్యింది. ఈ చిత్ర రివ్యూ ఎలా ఉంది అంటే?