- Tribute: దేశ సమగ్రతకు పటేల్ అందించిన సేవలు మరువలేనివి: గవర్నర్
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. దేశ సమగ్రతకు పటేల్ అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.
- SCHEDULE RELEASE: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్(mlc election schedule) విడుదలైంది.ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 9న నోటిఫికేషన్, 29న పోలింగ్.. అదే రోజు లెక్కింపు జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
- father salutes son: పుత్రోత్సాహం.. కుమారుడికి తండ్రి సెల్యూట్
కొడుకు.. తనకంటే గొప్ప స్థానంలో ఉంటే.. ఆ తండ్రికి కలిగే ఆనందాన్ని కళ్లకు కట్టిన సన్నివేశం కర్నూలు జిల్లాలో జరిగింది. తన కంటే మంచి హోదాలో ఉన్న పుత్రున్ని చూసి మురిసిన తండ్రి.. కొడుకుకి సెల్యూట్ చేసి పుత్రోత్సాహాన్ని చాటుకున్నారు.
- Huzurabad by poll 2021 : ఓటు వేసే అవకాశం దక్కని 20 మంది అభ్యర్థులు
తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. హుజూరాబాద్ బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు ఇక్కడ ఓటు వేయలేని చిత్రమైన పరిస్థితి ఎదురైంది (20 candidates who failed to vote). మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 10 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- వంద కోసం వార్డుబాయ్ కక్కుర్తి.. ముక్కుపచ్చలారని చిన్నారి బలి
ప్రాణాలు పోసే ఆస్పత్రుల్లో కొందరి కాసుల కక్కుర్తి అభం శుభం తెలియని వారిని పొట్టన బెట్టుకుంటోంది(Ward Boy removed Oxygen pipe for money). వార్డుబాయ్ వంద రూపాయల కక్కుర్తి.. ఓ చిన్నారిని బలి తీసుకుంది. కేవలం రూ.100కు ఆశపడి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారి ఆక్సిజన్ పైపును వేరే వాళ్లకు అమర్చాడు ఓ వార్డుబాయ్. ప్రాణవాయువు అందక ఉక్కిరిబిక్కిరి అయి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు ఆ చిన్నారి. అనంతరం కొన్ని క్షణాల్లోనే కన్నుమూశాడు.
- 'పటేల్ స్ఫూర్తితోనే భారత్ అన్ని సవాళ్లు ఎదుర్కోగలుగుతోంది'
దేశ ప్రజల హృదయాల్లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చిరస్థాయిగా నిలిచారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఎల్లప్పుడూ సమ్మిళితంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని సర్దార్ పటేల్ కోరుకున్నారని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే దేశం ఇప్పుడు అన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు.
- మేడపై నుంచి పడి.. రెండు గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారి!
మేడపై ఆడుకుంటున్న రెండున్నరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు ఇరుకైన సందులో పడిపోయింది. ఆరు అంగుళాల స్థలం ఉన్న రెండు గోడల మధ్య బాలిక ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా బాలికను కాపాడారు.
- ఒకే బైక్‌పై 10మంది ప్రయాణం.. ఇదెక్కడి ఐడియా గురూ!
పెట్రోల్ ధరల వరుస పెరుగుదలతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అయితే.. ఈ సమయంలో చాలా మంది బైక్‌లపై (Bike viral video) వెళ్లడం తగ్గించడమో లేక ప్రయాణాలు మానుకోవడమో చేస్తున్నారు. కానీ.. ఓ వ్యక్తి(Desi jugaad video) చేసింది చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. తనతో కలిపి ఏకంగా 10 మంది ద్విచక్రవాహనంపై ప్రయాణించారు. అసలు ఇదెలా సాధ్యమైంది అనుకుంటున్నారా? ఇది చూసేయండి మరి..
- T20 World Cup: అలా జరిగితేనే సెమీస్‌కు టీమ్ఇండియా!
టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) ఇప్పటికే మూడు విజయాలు సాధించిన పాకిస్థాన్.. సెమీస్ చేరడం దాదాపు ఖాయమైంది. ఇక మిగిలిన ఒకే ఒక్క స్థానం కోసం ప్రధానంగా టీమ్ఇండియా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ పోటీపడుతున్నాయి. భారత్ సెమీస్ (T20 World Cup Semi Final) చేరాలంటే ఇంతకీ ఏం చేయాలంటే?
- SS RAJAMOULI: 'పవన్‌తో సినిమా తీయాలని ఎదురు చూస్తున్నా'
శ్రీకాకుళం జిల్లా(srikakulam district)లోని రాగోలు జెమ్స్ వైద్య కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(director SS Rajamouli) హాజరయ్యారు. జీవితంలో ముందడుగు వేస్తేనే విజయం సాధించగలమని రాజమౌళి స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులతో మమేకమై పలువురి ప్రశ్నలకు సమాధానమిచ్చారు.