ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM - top news at 11am

ప్రధాన వార్తలు @ 11 AM

top news at 11am
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Mar 7, 2021, 10:59 AM IST

  • ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ ఆగివున్న కూలీల ట్రాక్టర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మన టీచర్​కు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి అభినందనలు

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఉపాధ్యాయురాలిని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్ అభినందించారు. పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఏటా ప్రధాని మోదీ విద్యార్థులతో మాట్లాడే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి... ఎలా సిద్ధపడాలో తెలిపే వీడియోను ఆమె తయారు చేయడంపై ఈ ఘనత సాధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'బాలకృష్ణ చిన్న పిల్లోడు... ఆయన్ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు'

విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి, కొడాలి నాని తెదేపా అధినేతపై విమర్శలు సంధించారు. పార్టీలో వచ్చిన విభేదాలను చక్కదిద్దుకోవాలని చంద్రబాబుకు సూచించారు. గుంటూరు, విజయవాడలో వైకాపానే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. ప్రజలకు పవన్ వీడియో సందేశం

పంచాయతీ ఎన్నికల్లో బీభత్సం సృష్టించిన వైకాపాకు ఓటేయొద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు అడ్డు అదుపులేకుండా పోతోందని.. ప్రజాస్వామ్యబద్ధంగా వారిపై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ 8 మందిని అప్పగించండి: మయన్మార్​

మయన్మార్​ నుంచి పారిపోయి వచ్చి మిజోరంలో తలదాచుకుంటున్న 8 మంది పోలీసులను అప్పగించాలని భారత్​ను ఆ దేశం కోరింది. ఈ మేరకు చాంపాయ్​ జిల్లా డిప్యూటి కమిషనర్​కు మయన్మార్​ అధికారి ఒకరు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోర్టు ఆదేశించినా.. నిందితుడిని వదిలేసిన పోలీసులు

ఛత్తీస్​గఢ్​లో ఓ వ్యక్తికి జైలు శిక్ష విధించాలని అక్కడి న్యాయస్థానం ఆదేశించింది. అయితే.. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఓ ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ నిందితుడిని విడుదల చేసి బయటకు పంపించారు. వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'రాజకీయాలకు 'కస్టమ్స్​'ను వాడుకుంటున్నారు'

భాజపా, కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేందుకు భాజపా, కాంగ్రెస్.. దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నాయని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇండోనేసియాలో భూకంపం.. 5.8 తీవ్రత నమోదు

ఇండోనేసియాలోని మాలుకు ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'సొంతగడ్డ'పై ఎదురులేని భారత్​

ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో ఘన విజయం సాధించిన భారత్.. సొంతగడ్డపై ఎదురులేని స్థితిలో నిలిచింది. అత్యధిక వరుస టెస్టు సిరీస్​ విజయాలు నమోదు చేసిన దేశాలలో అగ్రస్థానంలో ఉంది. పది వరుస విజయాలతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రియాంక కొత్త రెస్టారెంట్​.. భర్తతో కలిసి పూజలు

పలు రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న నటి ప్రియాంక చోప్రా.. ఇప్పుడు రెస్టారెంట్​ బిజినెస్​లోకి ఎంట్రీ ఇచ్చింది. భర్తతో కలిసి రెస్టారెంట్​కు పూజ చేసిన ఫొటోల్ని ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.