- అప్పుడు.. ఇప్పుడు.. మొదటి వరసలో ఆ ఇద్దరూ!
అప్పుడు... వాళ్లు ముందుకొచ్చారు.. ప్రపంచం వైరస్‌తో వణికిపోవడం చూశారు... వందల సంఖ్యలో మరణాలనూ కళ్లారా చూశారు... అయినవాళ్లే వదిలేసి వెళితే ఆ రోగులున్న వార్డులని శుభ్రం చేశారు. వాళ్లకు సేవలు చేశారు.ఇప్పుడు... వాళ్లే ముందుకొచ్చారు.. వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనే సందేహం.. అనేకమందికి దానిపై అపోహాలూ ఇంకెన్నో! చాలామంది దూరంగా జరుగుతున్నప్పుడు మొదటి టీకా వారే తీసుకున్నారు. వీరే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పారిశుధ్య కార్మికులు కిష్టమ్మ, పుష్ప. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చర్చిల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సోము వీర్రాజు
రాష్ట్రంలోని చర్చిల ఆస్తులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చర్చి ఆస్తుల అంశంపై కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- తిరుగు ప్రయాణమయ్యే వారికి... ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వచ్చి..తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, చెన్నై విశాక నగరాలకు విజయవాడ నుంచి 300 సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ కృష్ణా రీజియన్ వెల్లడించింది పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖ ఎక్సైజ్‌శాఖలో ఏం జరుగుతోంది?
రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో కీలకంగా భావించే విశాఖ ఎక్సైజ్ ఉప కమిషనర్(డీసీ) పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న కె.హేమంత నాగరాజును అధికారులు బదిలీ చేశారు. ఈయన విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కూలీల ఆటో బోల్తా.. మహిళ మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొనకొండ్ల సమీపంలో కూలీల ఆటో బోల్తా పడగా మహిళ మృతి చెందింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కన్నతండ్రినే గదిలో బంధించి చిత్రహింసలు
డబ్బు విషయంలో ఓ కూతురు.. తన భర్తతో కలిసి కన్నతండ్రినే చిత్రహింసలు పెట్టిన ఘటన కర్ణాటకలో జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తొలి రోజే 12 కీలక దస్త్రాలపై బైడెన్ సంతకం!
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన పలు హామీలను నెరవేర్చే దిశగా కీలక దస్త్రాలపై బైడెన్ సంతకాలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ట్రంప నిబంధనల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి తీపి కబురు అందించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బిట్‌కాయిన్‌లో పెట్టుబడులా? జర ఆలోచించండి
బిట్‌కాయిన్.. ఇదో రకం క్రిప్టో కరెన్సీ. ఇది కనిపించదు కానీ వార్తల్లో ఈ మధ్య బాగా వినిపిస్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి కొంగుబంగారంగా నిలిచింది. జీవనకాల గరిష్ఠాలను చేరుకుని మార్కెట్లో అంతకంతకూ దీని విలువ పెరుగుతోంది. దీంతో బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పలు సూచనలు చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ద్రవిడ్ అడుగుజాడల్లో పాక్ మాజీలు నడవాలి'
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అడుగుజాడల్లో పాక్ దిగ్గజాలు నడవాలని అభిప్రాయపడ్డాడు ఆ దేశ మాజీ సారథి షాహిద్ అఫ్రిది. అప్పుడే పాక్ క్రికెట్ భవిష్యత్తు మెరుగ్గా తయారవుతుందని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మెడలో రుద్రాక్షతో 'సిద్ధ'గా రామ్‌చరణ్
ఎట్టకేలకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 'ఆచార్య' షూటింగ్లో అడుగపెట్టారు. ఇందులో చెర్రీ.. సిద్ధ అనే పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్లో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.