- ప్రక్రియ ముగిసింది.. బదిలీయే మిగిలింది!
రాష్ట్రంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ ముగిసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టనున్నారు. హేతుబద్ధీకరణలో సుమారు 15 వేల మందికి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రాష్ట్రవ్యాప్తంగా పొంగుతున్న వాగులు, వంకలు
రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో చెరువులు, వాగులు, వంకలు పొంగుతున్నాయి. వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'ఎస్సీల మీద దాడులపై సీబీఐతో దర్యాప్తు చేయించండి'
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎస్సీలపై జరుగుతున్న దాడుల మీద.. సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చారిత్రక ఐరాస సమావేశాల్లో మోదీ కీలక ప్రసంగం
ఈసారి జరగనున్న ఐక్యరాజ్య సమితి 75వ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాని మోదీ రెండు ఉన్నతస్థాయి చర్చల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఒక్కరోజులో 93,337 కరోనా కేసులు, 1247 మరణాలు
భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 93,337 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 1,247 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఎన్ఐఏ తనిఖీలు: అల్‌ఖైదాకు చెందిన 9 మంది అరెస్ట్
అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా కార్యకలాపాలు సాగిస్తోన్న 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బంగాల్, కేరళలో జరిపిన సోదాల్లో వీరు పట్టుబడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పక్షవాత స్కాన్లతో కరోనాను గుర్తించొచ్చు!
కరోనా గుర్తించేందుకు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. పక్షవాతాన్ని గుర్తించేందుకు వాడే స్కాన్లతో కరోనాను కనిపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో మెదడుకు గాయమైనట్లు అనుమానమున్న వారిలో కొవిడ్ బాధితులను త్వరగా గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 2021 ఏప్రిల్ నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్
2021 ఏప్రిల్ నాటికి అమెరికా ప్రజలందరికీ కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయని వాటిని ఆమోదించిన వెంటనే టీకాను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఐపీఎల్2020: నెట్టింట ధోనీ అభిమానుల సందడి
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య పోరుతో నేడు ఐపీఎల్ మొదలవనుంది. చాలా కాలం తర్వాత ధోనీ రాకతో అతడి అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నెలకొంది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా 'ధోనీ ఈజ్ బ్యాక్' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వచ్చే ఏడాది దీపావళికి 'పొన్నియన్ సెల్వన్'!
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి