ETV Bharat / city

ప్రధాన వార్తలు @11AM - andhrapradesh latest news

.

Top News @ 11 AM
ప్రధాన వార్తలు @11AM
author img

By

Published : Sep 17, 2020, 11:00 AM IST

  • రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్‌ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మొదటి విడత పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో విడత పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఇంద్రకీలాద్రిపై వివాదం... దేవాదాయశాఖ విచారణ ముమ్మరం

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయ వెండి రథానికి ఉండే వెండి సింహాల ప్రతిమలు... చోరీకి గురైనట్లు ఆలయ అధికారులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. ఘటనపై దేవదాయశాఖ తరఫున విచారణ ప్రారంభించారు. వెండి సింహాల విగ్రహాల అదృశ్యంపై సమగ్ర విచారణ చేయించి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలకంగా ఐఎస్: కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) అత్యంత క్రీయాశీలంగా ఉందని కేంద్ర హోంశాఖ రాజ్యసభలో తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అకాల వర్షాలు... అన్నదాతలకు నష్టాలు

రాష్ట్రంలో వర్షాలు... రైతులను కంటతడిపెట్టిస్తున్నాయి. వరుణుడు శాంతించినా అనేక పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. 9 జిల్లాల్లో సుమారు లక్షా 44 వేలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతింది. సుమారు 288 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రికార్డ్​ స్థాయిలో: కొత్తగా 97,894 కేసులు, 1132 మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చుతుంది. కొత్తగా 97,894 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 1,132 మంది కొవిడ్​కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మోదీకి సైకత శిల్పంతో శుభాకాంక్షలు

ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా తనదైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్​ పట్నాయక్. ఒడిశా పూరీ సాగర తీరంలో ఇసుకతో మోదీ బొమ్మ రూపొందించి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు ప్రధానికి ఉంటాయని...'ఆత్మనిర్భర్​ భారత్ రూపశిల్పి' అంటూ శిల్పంపై సుదర్శన్ రాశారు. వీడియో కోసం క్లిక్ చేయండి

  • 'ఒరాకిల్​- టిక్​టాక్​ ఒప్పందాన్ని నేను చూడాలి'

చైనా కంపెనీ బైట్‌డాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌ యాప్ అమెరికా కార్యకలాపాలు ప్రముఖ అమెరికన్‌ సంస్థ ఒరాకిల్ సొంతం కానున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని తాను పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ వెల్లడించారు. జాతీయ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • '2020-21లో భారత జీడీపీ క్షీణత 8.6 శాతం'

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ క్షీణత 8.6 శాతంగా ఉండొచ్చని యూబీఎస్​ సెక్యూరిటీస్​ అంచనా వేసింది. సంక్షోభ సమయంలో ప్రభుత్వ స్పందన తదితరాలను పరిగణించి.. తాజా సవరణ చేసినట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ పేర్కొంది. వృద్ధి పతనం కాకుండా చేపట్టే చర్యల విషయంలో ప్రభుత్వం నుంచి బలహీన స్పందన కనిపించిందని ఆ సంస్థ అంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఐపీఎల్: వీరు​ అరంగేట్రంలోనే అదరగొడతారా?

ఈ శనివారం నుంచి ఐపీఎల్​ 13వ సీజన్​ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో తొలిసారి లీగ్​ బరిలో దిగనున్న టాప్​ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలుగు వెబ్​ సిరీస్​కు మిల్కీబ్యూటీ గ్రీన్​సిగ్నల్​!

మిల్కీబ్యూటీ తమన్నా ఓ తెలుగు వెబ్​ సిరీస్​లో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. 'గరుడ వేగ' ఫేమ్​ ప్రవీణ్​ సత్తారు ఈ సిరీస్​కు దర్శకత్వం వహించనున్నాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.