ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM - andhrapradesh latest news

ప్రధాన వార్తలు @ 11 AM

Top News @ 11 AM
Top News @ 11 AM
author img

By

Published : Aug 29, 2020, 10:58 AM IST

  • హరికృష్ణ వర్ధంతి: చంద్రబాబు, లోకేశ్ నివాళి

నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా అనేక సేవలు అందించారని హరికృష్ణను చంద్రబాబు కొనియాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 10 రోజులు చికిత్స.. రూ.15 లక్షలు బిల్లు.. చివరికి మృతి!

విజయవాడలోని ఆటోనగర్‌ లిబర్టీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతి వ్యవహారం వివాదాస్పదమైంది. కొవిడ్ చికిత్స పేరుతో రూ.15 లక్షలు వసూలు చేశారని మృతుడి భార్య ఆరోపించారు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే మరణించాడని పటమట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కరోనా పంజా: కొత్తగా 76,472 కేసులు, 1021 మరణాలు

దేశంలో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 76,472 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా మరో 1,021 మంది మరణించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • తెలంగాణ: మరో 2751 మందికి సోకిన కరోనా

తెలంగాణలో కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో 2751 మందికి కరోనా సోకగా... 9 మంది మరణించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఉగ్ర ఏరివేత: ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. వరుస ఎన్‌కౌంటర్లతో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. పుల్వామాలోని జధోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు హతమార్చాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'జాతీయ క్రీడా పురస్కారాల ప్రైజ్​ మనీ భారీగా పెంపు'

జాతీయ క్రీడలు, సాహస పురస్కారాలు-2020 ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం వర్చువల్​గా నిర్వహిస్తోంది కేంద్రం. ఈ సందర్భంగా పురస్కార విజేతలకు శుభవార్త అందించారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్​ రిజిజు. పురస్కారాల నగదు బహుమతిని భారీగా పెంచినట్లు ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించడమే సరైన నిర్ణయం'

ప్రస్తుత పరిస్థితుల్లో నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించడమే ఉత్తమమైన నిర్ణయమని చెప్పారు విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనిల్​ స్వరూప్​. ఈటీవీ భారత్​తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వం ముందు మరో మార్గం లేదని తెలిపారు. విలువైన ఏడాది కాలాన్ని విద్యార్థులు కోల్పోకుండా ఉండాలంటే పరీక్షలు జరపాల్సిందేనన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బ్రిటన్​ ప్రధానికి మహిళ లేఖ.. దిల్లీ పోలీసులు పరుగోపరుగు

దిల్లీకి చెందిన ఓ మహిళ.. తనకు సహాయం చేయమని ఏకంగా బ్రిటన్​ ప్రధానికే లేఖ రాసింది. లేకపోతే రెండు గంటల్లో ఆత్మహత్య చేసుకుంటానని డెడ్​లైన్​ పెట్టింది. దీంతో అప్రమత్తమైన బ్రిటన్​ అధికారులు.. భారత్​కు సమాచారన్ని చేరవేశారు. పోలీసులు ఆమెను పట్టుకునేందుకు అర్ధరాత్రి వేళ దిల్లీ వీధులను జల్లెడపట్టాల్సి వచ్చింది. తీవ్రంగా శ్రమించిన అనంతరం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సన్​రైజర్స్​ కొత్త ఆటగాళ్లను పరిచయం చేసిన లక్ష్మణ్

ఐపీఎల్ కోసం సిద్ధమవుతోంది సన్​రైజర్స్ హైదరాబాద్. ఈ సందర్భంగా సీజన్​లో కొత్త ఆటగాళ్లను పరిచయం చేశాడు జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్. అందులో హైదరాబాద్​కు చెందిన సందీప్ భవనక కూడా ఉన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'సమయాభావం వల్లే.. వేరే కారణమేమీ లేదు'

మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. ప్రస్తుతం స్వీటి నటించిన 'నిశ్శబ్దం' విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ నటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించదు. తాజాగా ట్విట్టర్​లోకి ఎప్పుడొస్తారు అన్న ప్రశ్నకు స్పందించింది స్వీటి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.