ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - Top News @ 1 PM

ప్రధాన వార్తలు @ 1 PM

Top News @ 1 PM
Top News @ 1 PM
author img

By

Published : Sep 19, 2020, 1:04 PM IST

Updated : Sep 19, 2020, 1:12 PM IST

  • 'ఆ నిర్ణయమే అమలైతే.. రాష్ట్రం రాష్ట్రంలా ఉండదు'

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఘూటు వ్యాఖ్యలు చేశారు. తితిదే ఆలయ నిబంధనలు, నమ్మకాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తితిదే కానుకలను బాండ్ల రూపంలో మార్చడమేంటని ప్రశ్నించారు. ఆ నిర్ణయమే అమలు జరిగితే రాష్ట్రం రాష్ట్రంలా ఉండదని హెచ్చరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • తిరుమలలో 'ఆ' నిబంధనను ఇప్పుడే ఎందుకు మార్చారు.. ?: ఐవైఆర్

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు... అన్యమతస్థులకు డిక్లరేషన్ అవసరం లేదని తితిదే నిర్ణయం తీసుకోవడాన్ని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. డిక్లరేషన్ నిబంధన ఎన్నో సంవత్సరాలుగా ఉందన్నారు. ఇప్పుడు ఎందుకు మార్చారో చెప్పాలని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఉపరాష్ట్రపతి వెంకయ్యకు సోమిరెడ్డి కృతజ్ఞతలు

నెల్లూరు రైతులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారని తెదేపా నేత సోమిరెడ్డి అన్నారు. సింహపురి రైతుల కష్టాలపై స్పందించిన ఉపరాష్ట్రపతికి సోమిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఎన్​ఐఏ తనిఖీలు: అల్​ఖైదాకు చెందిన 9 మంది అరెస్ట్

అల్​ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా కార్యకలాపాలు సాగిస్తోన్న 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బంగాల్​, కేరళలో జరిపిన సోదాల్లో వీరు పట్టుబడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'కుల్‌భూషణ్‌ యాదవ్‌ కేసులో అది సాధ్యం కాదు

పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ యాదవ్‌ తరపున వాదించేందుకు భారతీయ న్యాయవాదిని అనుమతించాలన్న ఇండియా డిమాండు ఆచరణలో సాధ్యం కాదని పాక్ వెల్లడించింది. పాకిస్థాన్‌కు చెందని న్యాయవాదిని యాదవ్‌ తరపున వాదించేందుకు అంగీకరించాలంటూ భారత్‌ కోరిందని పాక్​ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్‌ చౌదరి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ప్రపంచంలో అత్యధిక కరోనా రికవరీలు భారత్‌లోనే

కరోనా నుంచి అత్యధిక మంది కోలుకున్న దేశాల జాబితాలో అమెరికాను దాటి భారత్‌ తొలి స్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 42.08 లక్షల మంది కోలుకున్నట్లు పేర్కొంది.. రికవరీ రేటు 80 శాతంగా ఉందని.. అలాగే మరణాల రేటు 1.61 శాతానికి చేరిందని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఏడడుగల నల్లనాగు.. భారీ పామును మింగేసింది

కర్ణాటకలో ఏడు అడుగుల నల్లనాగు.. ఐదడుగుల పామును ఆరగించింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అమెరికా బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు: చైనా

టిక్​టాక్​, వీచాట్​ యాప్​లను నిషేధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని చైనా తప్పుబట్టింది. చైనాపై అమెరికా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని, అంతర్జాతీయ నియమాలను పాటిస్తూ నైతికత, పారదర్శకతతో కార్యకలాపాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. అమెరికా ఇలాగే ఏకపక్ష ధోరణిలో ముందుకెళ్తే మాత్రం దీటుగా స్పందిస్తామని హెచ్చరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • యువరాజ్​ ఆరు సిక్సర్ల ఘనతకు 13 ఏళ్లు

2007 సెప్టెంబరు 19న ఇంగ్లాండ్​- భారత్ మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్​ మ్యాచ్ యువరాజ్​ సింగ్​ కెరీర్​లో ఓ మైలురాయి. ఆ మ్యాచ్​లోనే యూవీ వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఘనతకు నేటితో 13 ఏళ్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సుశాంత్​తో కృతి సనన్​ డేటింగ్​ చేసిందా?

యువ హీరో సుశాంత్​ రాజ్​పుత్, కృతి సనన్​ ఒకప్పుడు డేటింగ్​లో ఉన్నారని నటి లిజా మాలిక్​ తెలిపింది. ఓ బర్త్​డే పార్టీకి హాజరైన సమయంలో వారిద్దరూ మంచి జంటలా కనిపించారని వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

Last Updated : Sep 19, 2020, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.