- ఏపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురు
రాజధాని భూ అవకతవకలపై సిట్ ఏర్పాటు చేస్తూ... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. సిట్ తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నాలుగు సింహాల్లో ఒక్క సింహం ప్రతిమే మిగిలింది: వీర్రాజు
కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథంలోని సింహాల్లో ఒక్క సింహ ప్రతిమే ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ప్రతిమల వార్తలు బయటికిరావడం ఆ పార్టీ నేతల బృందం ఆలయాన్ని సందర్శించి, రథానికి ఉన్న సింహా ప్రతిమలను పరిశీలించింది. ఈ ఘటనపై రెండు రోజుల్లో నివేదికను ప్రజలకు తెలియజేయాలని నేతలు డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సింహాల ప్రతిమలు 3 లేవు.. విచారణ చేస్తున్నాం: మంత్రి వెల్లంపల్లి
కనకదుర్గమ్మ ఆలయ వెండి రథానికి మూడు సింహం ప్రతిమలు లేవని.. ఒక్కటే మిగిలి ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆలయ రథాన్ని పరిశీలించిన ఆయన... విచారణ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. సాయంత్రం వరకు ప్రాథమిక నివేదిక అందుతుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపటి నుంచే ఏపీ ఎంసెట్.. విస్తృతంగా ఏర్పాట్లు
గురువారం నుంచి ఏపీ ఎంసెట్ ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణలో కలిపి 118 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రవేశ పరీక్షల ప్రత్యేకాధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లైవ్ వీడియో: మందుపాతరను నిర్వీర్యం చేసిన బలగాలు
పోలీసులే లక్ష్యంగా... మావోయిస్టులు అమర్చిన 5 కిలోల మందుపాతరను సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వీర్యం చేశాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కుటం పరిధిలోని ముర్లిగూడాలో కలకలం సృష్టించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చంబల్ నదిలో పడవమునక-ఐదుగురు మృతి
పడవమునిగిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ప్రమాద సమయంలో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 20-25 మంది ఈదుకుంటా ఒడ్డుకు చేరుకోగా.. మరో 10 మందికిపైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మాస్కు ధరించకపోతే.. గోతులు తవ్వాల్సిందే
ఇండోనేసియాలోని జావాలో మాస్క్‌లు ధరించకుండా బయటకు వచ్చే వారిని వినూత్నంగా శిక్షిస్తున్నారు అక్కడి అధికారులు. మాస్క్‌లు లేని వారికి గోతులు తవ్వే శిక్షను విధిస్తున్నారు. కొవిడ్ కారణంగా మరణించిన వారి మృతదేహాలను పూడ్చటానికి వీటిని ఉపయోగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవిడ్-19 టీకా తయారీలో అరబిందో ఫార్మా ముందడుగు
కరోనా వైరస్‌కు టీకా తయారీ కోసం ఫార్మా సంస్థ అరబిందో.. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్‌తో)తో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. సీఎస్‌ఐఆర్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం.. కరోనా వ్యాక్సిన్ తయారీ, విక్రయ కార్యకలాపాలపై అరబిందో దృష్టి సారించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వంద మీటర్ల పరుగులో అథ్లెట్లతో పాటు పిల్లి
టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన బాల్కన్ అండర్-20 పురుషుల అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోని వంద మీటర్ల పరుగులో ఓ పిల్లి అడ్డుగా వచ్చింది. ఈ రేసు ముగింపు రేఖ వద్ద అథ్లెట్లు సమీపిస్తున్న సమయంలో వారికి కాళ్లకు అడ్డంగా దూసుకువెళ్లింది. అథ్లెట్లు పరుగు తీస్తూ పిల్లిని భయభ్రాంతులకు గురిచేయడం వల్ల అది అక్కడ నుంచి పారిపోయింది. ఈ వంద మీటర్ల పరుగులో టర్కీకి చెందిన అథ్లెట్ ఉముత్ ఉయ్సాల్ గెలుచుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టైలిష్ లుక్‌లో డార్లింగ్ ప్రభాస్
పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అగ్ర కథానాయకుడు ప్రభాస్.. కొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. స్టైలిష్‌గా కనిపిస్తూ అభిమానుల మనసు దోచేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది కాస్త వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.