ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9AM

.

author img

By

Published : Feb 5, 2022, 9:00 AM IST

ప్రధాన వార్తలు @9AM
ప్రధాన వార్తలు @9AM
  • పీఆర్సీ నివేదికపై రాని స్పష్టత... నేడు మరోసారి భేటీ

పీఆర్‌సీ సాధన సమితి నాయకులకు, మంత్రుల కమిటీకి మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు చర్చలు కొనసాగాయి. ఐఆర్‌ రికవరీ చేయబోమని, పీఆర్‌సీని ఐదేళ్లకు ఒకసారి వేస్తామని మంత్రుల కమిటీ నుంచి స్పష్టమైన హామీ లభించింది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, సీపీఎస్‌ రద్దు వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగినా... మంత్రుల కమిటీ నుంచి స్పష్టమైన హామీ ఏదీ లభించలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Road accident: గుంటూరు జిల్లాలో రోడ్డుప్రమాదం... ముగ్గురు విద్యార్థులు మృతి

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. విద్యుత్‌ స్తంభాన్ని బైకు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వేసవిలో అదనపు విద్యుత్ కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

వేసవిలో అదనపు విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేసుకునేలా డిస్కంలకు ఈఆర్సీ.. పచ్చజెండా ఊపింది. స్వల్పకాలిక పద్ధతిన అనుమతులు మంజూరు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కీలక ఘట్టానికి శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు

జగద్గురు శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడు అత్యంత కీలకమైన ఘట్టం జరుగబోతుంది. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమతామూర్తి విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 3 గంటలపాటు ముచ్చింతల్​లోనే మోదీ గడపనున్నారు. ప్రధాని రాక సందర్భంగా 8 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • స్పుత్నిక్​ లైట్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి!

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-లైట్‌ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ.. డీసీజీఐకు సిఫారసు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జనవరి 31న జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో ఈ మేరకు సిఫారసు చేసినట్లు పేర్కొన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'కొవిడ్‌ బాధిత కుటుంబాలను పెద్ద మనసుతో ఆదుకోండి'

కరోనా బాధిత కుటుంబాలను ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆదుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొవిడ్ పరిహారం కోసం ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోకుంటే రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (ఎస్‌ఎల్‌ఎస్‌ఏ)ల సభ్య కార్యదర్శులు వారిని గుర్తించి ప్రభుత్వ తోడ్పాటు అందేలా చూస్తారని పేర్కొంది. అందుకు అవసరమైన చర్యలన్నీ సమన్వయంతో సాగేందుకు ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • శ్రీనగర్​​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్ జకూరా ప్రాంతంలో ఎన్​కౌంటర్ జరిగింది. బలగాల కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Omicron variant: ఆ కారణంగానే ఒమిక్రాన్‌ లక్షణాలు స్వల్పం!

కరోనావైరస్‌ గుణం కంటే వాటిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ప్రజల్లో అధికంగా ఉండటం వల్లే ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువగా ఉండటానికి కారణమనే అంచనాకు వచ్చారు నిపుణులు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ల ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన శాస్త్రవేత్తలు, సాధ్యమైనంత త్వరగా ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలకు కరోనా వ్యాక్సిన్లను అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ప్రధానిపై విమర్శలు.. ఒలింపిక్‌ గోల్డ్ మెడలిస్ట్‌పై నిషేధం

ఆ దేశ ప్రధాన మంత్రిని అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించి విమర్శించాడనే కారణంతో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ రషీద్‌ ఉల్‌ హసన్‌పై పదేళ్లపాటు నిషేధం విధించారు. అయితే తాను అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రషీద్​ అన్నాడు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • చెర్రీ యాక్షన్‌ షురూ.. సైఫ్‌ తప్పుకొన్న చిత్రంలో కరీనా

శంకర్​-రామ్​చరణ్​ కాంబోలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్​ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్‌లో చెర్రీపై పోరాట ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. కాగా, బాలీవుడ్​ హీరో సైఫ్​ అలీఖాన్​ తప్పుకొన్న ఓ చిత్రంలో నటించేందుకు ఆయన భార్య, హీరోయన్​ కరీనా కపూర్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది! పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.