ETV Bharat / city

ప్రధానవార్తలు@9AM - trending news

.

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Jun 19, 2020, 9:00 AM IST

  • అఖిలపక్ష భేటీ

సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. అన్ని పార్టీల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు ప్రధాని. ఆయా పార్టీల నేతల అభిప్రాయాలను తెలుసుకుని.. సరిహద్దు వివాదంలో విధాన నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నేడే ఎన్నికలు

రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో వైకాపా తరఫున నలుగురు, తెలుగుదేశం నుంచి ఒకరు పోటీ పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తొలివిడతో 256 సర్వీసులు

ఏపీ నుంచి తెలంగాణకు తొలివిడతగా 256 సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధమని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ జాబితాను టీఎస్‌ఆర్టీసీ అధికారులకు అందజేశారు. రెండు ఆర్టీసీల ఈడీలు, ఇతర అధికారులు అంతర్రాష్ట్ర ఒప్పందంపై విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో గురువారం ప్రాథమిక చర్చలు జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారీగా పెరిగిన కరోనా కేసులు

రాష్ట్రంలో గడచిన 10 రోజుల్లో కరోనా కేసుల ఉద్ధృతి బాగా పెరిగింది. మార్చి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో మూడొంతులకు పైగా ఈ పది రోజుల్లోనే నమోదయ్యాయి. కేవలం పది రోజుల వ్యవధిలో 2,467 కేసులు పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • స్వదేశానికి 2.5 లక్షల మంది రాక

వందే భారత్​ మిషన్​లో భాగంగా ఇప్పటి వరకు 2.5 లక్షల మందికిపైగా స్వదేశానికి తరలించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మూడో దశ మిషన్​ జులై 2 వరకు కొనసాగుతుందని పేర్కొంది. మొత్తం 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మండిపోతున్న పెట్రో ధరలు

దేశంలో రోజురోజుకూ పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. గత 12 రోజుల్లో లీటరుపై రూ. 6కు పైగా మోత మోగింది. డీజిల్​ ధర కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మళ్లీ విజృంభిస్తోన్న కరోనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 85 లక్షల మందికిపైగా వైరస్​ సోకింది. 4.56 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. ఐరోపాలోని జర్మనీ, గ్రీస్​లో మళ్లీ వైరస్​ విజృంభిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • #ప్లే ఫర్ ఇండియాకు మద్దతు

కరోనా వల్ల ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న క్రీడా సిబ్బంది కోసం, దేశంలోని ప్రముఖ క్రీడాకారులు ముందుకొచ్చారు. 'ప్లే ఫర్​ ఇండియా'​ కార్యక్రమం ద్వారా విరాళాలు సేకరించి వారిని ఆదుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'చందమామ' అందం కాజల్​కే​ సొంతం

వన్నె తరగని అందం అంటారు కదా! ఈ మాట ముద్దుగుమ్మ కాజల్‌కు అక్షరాలా వర్తిస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పదమూడేళ్లు అవుతున్నా... ఇప్పటికీ తన అందంతో మాయ చేస్తోంది కాజల్ ఈ రోజు కాజల్ 36వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆమె గురించి విశేషాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'సర్కారు వారి పాట'లో ఆమెనే ​హీరోయిన్​

సూపర్​స్టార్ మహేశ్‌బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'. గత నెల చివర్లో సూపర్​స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టైటిల్‌ పోస్టర్‌ ఆసక్తి రేకెత్తించింది. అయితే ఇందులో హీరోయిన్​గా కీర్తిసురేశ్‌ నటించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.