ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - తెలుగు తాజా వార్తలు

ప్రధాన వార్తలు @ 9 PM

Top News  9 PM
ప్రధాన వార్తలు @ 9 PM
author img

By

Published : Aug 4, 2021, 8:59 PM IST

Updated : Aug 4, 2021, 9:08 PM IST

  • రేపే జగనన్న పచ్చతోరణం ప్రారంభం

మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో.. గురువారం ఉదయం మొక్కనాటి జగనన్న పచ్చతోరణం – వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ITDP: కార్యకర్తలకు రక్షణగా.. ఐటీడీపీ వెబ్​సైట్ ప్రారంభం

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న తెదేపా కార్యకర్తలకు రక్షణగా నిలిచేందుకు ఐటీడీపీ వెబ్​సైట్​ను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించారు. పోస్టులపై పోలీసులు ఇబ్బంది పెట్టినా, వైకాపా చిల్లర గ్యాంగులు బెదిరించినా వాట్సప్ లింక్​లో సమాచారం అందిస్తే అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • జాతీయ నేతల మద్దతు

దిల్లీలోని జంతర్​ మంతర్ వద్ద పోలవరం ముంపు బాధితులు నిరసన చేపట్టారు. బాధితులకు జాతీయ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. పోలవరం భూనిర్వాసితులను ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • viveka murder case: వివేకా హత్యకేసు.. సునీల్‌యాదవ్‌కు 14 రోజుల రిమాండ్‌

వివేకా హత్య కేసులో (Viveka murder case) అనుమానితుడైన సునీల్‌ను పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో నిన్నటినుంచి సునీల్‌ యాదవ్‌ను ప్రశ్నించిన అధికారులు.. పులివెందల తీసుకెళ్లి అక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. సునీల్‌ యాదవ్‌కు 14 రోజుల పాటు పులివెందుల కోర్టు రిమాండ్‌ విధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐదు బిల్లులకు ఆమోదం!

గందరగోళ పరిస్థితుల మధ్యే పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు కొనసాగాయి. విపక్షాల ఆందోళన నడుమ మూడు బిల్లులు రాజ్యసభ, రెండు బిల్లులు లోక్​సభ ఆమోదం పొందాయి. విపక్షాల తీరు పట్ట రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయగా.. సభ సజావుగా జరగకపోవడానికి కారణం ప్రభుత్వమేనని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేంద్రం క్లారిటీ

కొవిడ్​ మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారన్న వార్తలపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. కొన్ని కరోనా కేసులను గుర్తించలేకపోయినప్పటికీ, మరణాలను తక్కువగా నమోదు చేయడం కుదరదని పేర్కొంది. భారత్​ మరణాల రిజిస్ట్రేషన్​ వ్యవస్థలో అన్నింటినీ నమోదు చేస్తారని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వారం రోజుల్లో 40 లక్షల కొత్త కేసులు'

గత వారం రోజుల్లో కొత్తగా 40 లక్షల మందికి కరోనా వైరస్(Corona Virus)​ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియా, ఆసియా దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉన్నట్లు హెచ్చరించింది. పేద దేశాలకు టీకా(Covid-19 vaccine) అందించేందుకు బూస్టర్​ డోస్​పై(Booster dose) మారటోరియం విధించాలని కోరారు టెడ్రోస్​ అధనోమ్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • నయా రికార్డులు

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్​లోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. సెన్సెక్స్ (Sensex today) 546 పాయింట్ల లాభంతో తొలిసారి 54,370 పైన స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 128 పాయింట్ల లాభంతో నూతన రికార్డు స్థాయి అయిన 16,259 మార్క్ దాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహిళా జట్టు ఓటమి

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళల హాకీ జట్టు చేజార్చుకుంది. సెమీఫైనల్​లో భారత అమ్మాయిలు ప్రపంచ నంబర్‌వన్‌ టీమ్​ అర్జెంటీనాపై పోరాడి ఓడారు. కీలకమైన సెమీస్‌లో రాణి రాంపాల్‌ సేన 1-2 తేడాతో ఓటమి పాలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చిత్రీకరణ పూర్తి

మెగాస్టార్​ చిరంజీవి(Chiranjeevi) 'ఆచార్య'(Acharya Movie) షూటింగ్​ చివరి షెడ్యూల్​ పూర్తయింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్​ షూటింగ్ పూర్తయిందని చిత్రబృందం వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరు, రామ్​చరణ్​(Ram Charan) కలిసి ఉన్న ఫొటోను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Aug 4, 2021, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.