ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9pm - top 10 news

.

top news 9 pm
top news 9 pm
author img

By

Published : May 11, 2020, 9:04 PM IST

పిల్లలూ.. పరీక్షలంటా..

జులైలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పరీక్షల షెడ్యూల్‌ను రూపొందిస్తున్నామని.. త్వరలో తేదీలు ప్రకటించనున్నట్లు తెలిపారు.

తరలింపుపై పిటిషన్

ఈ నెల 28న సచివాలయాన్ని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని హైకోర్టులో అమరావతి పరిరక్షణ సమితి వ్యాజ్యం దాఖలు చేసింది. రాజధాని తరలింపు అంశంపై ఇప్పటికే పెండింగ్​లో ఉన్న పిటిషన్​పై​ అత్యవసర విచారణ జరపాలని కోరింది.

అక్కడివేం తాగొద్దు... తినొద్దు

విశాఖలో పర్యటించిన కేంద్ర నిపుణుల బృందం పలు సూచనలు చేసింది. దుర్ఘటన జరిగిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల పరిధిలో పండిన కూరగాయలు, పండ్లు తినరాదని సిఫార్సు చేసింది. మరి కొన్ని సూచనలు కూడా చేసింది..

ఈ బాధ ఏ తల్లికి రావొద్దు

కటిక పేదరికం ఓ ఇంట తీరని విషాదం నింపింది. కరోనా వైరస్‌ ఆ బాధను వెయ్యింతలు చేసింది. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డ కడుపేదరికంతో దూరం కాగా... లోకాన్ని వీడిన బిడ్డ మహమ్మారి కారణంగా గౌరవంగా సాగనంపలేకపోయారు. రిక్షాపైనే అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది.

ఆయన ఆరోగ్యం మెరుగుపడింది

అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు దిల్లీ ఎయిమ్స్ వైద్య వర్గాలు తెలిపాయి. కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించాయి.

పదే పది నిమిషాలంతే..

లాక్​డౌన్​ ఆంక్షల సడలింపు తర్వాత ప్రారంభమైన రైలు సేవలకు భారీ డిమాండ్​ ఏర్పడింది. మంగళవారం హావ్​డా నుంచి దిల్లీ వెళ్లనున్న రైలులోని ఏసీ టైర్​-1, టైర్​-3 టికెట్లు 10 నిమిషాల్లో అమ్ముడైపోయాయి తెలుసా..

17 రోజులు..

హోం క్వారంటైన్​లో ఉన్న కరోనా బాధితులకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. చిన్నపాటి వైరస్​ లక్షణాలు బయటపడినవారు.. 17రోజులకు హోం క్వారంటైన్​​కు స్వస్తి పలకవచ్చని తెలిపింది.

మళ్లొచ్చింది..

కరోనా నుంచి కొలుకుని పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన చైనా వుహాన్​లో మళ్లీ వైరస్​​ కలవరం మొదలైంది. కొవిడ్​-19​ కేంద్ర బిందువైన వుహాన్​ నగరంలో ఆరు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోనందుకు స్థానిక అధికారిని తొలిగించింది ప్రభుత్వం.

ఫీల్డర్స్​ కరవు

ప్రస్తుత భారత జట్టులో పూర్తిస్థాయి ఫీల్డర్స్​ కరవయ్యారని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్​ మహ్మద్​ కైఫ్​. గతంతో పోలిస్తే మైదానంలో ఎలాంటి బంతులనైనా అడ్డుకోగలిగే వారి సంఖ్య తగ్గిందని అన్నాడు.

వెరైటీ ట్వీట్​

మాతృ దినోత్సవం సందర్భంగా తన ప్రేయసి నయనతారకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు విఘ్నేశ్ శివన్. "నా పిల్లలకు కాబోయే తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.