- BOARDS MEETING: ఇవాళ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ
నదీ యాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించిన కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఈరోజు దిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- power charges: ఇంకో 2,542 కోట్ల రూపాయల సర్దుబాటుకు డిస్కంలు సిద్ధం
విద్యుత్ వినియోగదారులకు మరో షాక్ ఇచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) సిద్ధమయ్యాయి. ఇప్పటికే కోట్ల రూపాాయాల భారం మోపిన డిస్కంలు.. మరోసారి కోట్ల రూపాయల సర్దుబాటుకు అవకాశమివ్వాలని ఇటీవల ఏపీఈఆర్‌సీకి ట్రూఅప్ పిటిషన్‌ను దాఖలు చేశాయి. అయితే దీనిపై ఏపీఈఆర్‌సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- wind energy: సముద్ర గాలుల నుంచి విద్యుత్.. కేఎల్‌యూ ఆచార్యుడి వెల్లడి
సముద్ర గాలుల నుంచి కాలుష్య రహిత విద్యుత్ తయారవుతుందని గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయం ఈసీఈ విభాగం సహ ఆచార్యులు చినసత్యనారాయణ పరిశోధనలో వెల్లడైంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నమ్మివచ్ఛి.. నిస్సహాయురాలిగా మారి..!
పెళ్లైన మహిళను ప్రేమించానన్నాడు. అతని తియ్యని మాటలను నమ్మిన ఆమె.. భర్త, ఇద్దరు పిల్లలు, పుట్టి పెరిగిన ఊరును వదిలి అతని వెంట వచ్చేసింది. వచ్చాక గానీ తెలియలేదు...తను చేసింది తప్పని. దానిని సరిదిద్దుకుందామంటే అతను సహకరించకపోగా.. హింసించడంతో కట్టుబట్టలతో రోడ్డుమీద పడింది. స్థానికుల సాయంతో పోలీసులు చెంతకు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'బదిలీలపై ఉద్యోగులు ఒత్తిడి తీసుకురాలేరు'
ఒక ఉద్యోగి తనను నిర్దిష్ట ప్రదేశానికి బదిలీ చేయాలని పట్టుపట్టడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన అవసరాలకు అనుగుణంగా బదిలీ చేయాలని ఓ లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Covid Test: ఇక పుక్కిలింతతో కొవిడ్ నిర్ధరణ!
కరోనా వైరస్‌ను సులువుగా గుర్తించే..'సెలైన్ గార్గిల్ ఆర్‌టీ-పీసీఆర్'(Saline Gargle Test) విధానాన్ని అభివృద్ధి చేసిన జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ (Neeri Covid Test).. దాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం సంబంధిత పరిజ్ఞానాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్‌ఎంఈ)కి అందజేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చాలా రోజుల తర్వాత విధులకు హాజరైన అఫ్గాన్ మహిళలు!
తాలిబన్లు పాలన చేపట్టే నాటికి అల్లకల్లోలంగా ఉన్న కాబుల్ విమానాశ్రయం ఇప్పుడిప్పుడే తెరచుకుంటోంది. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొందరు మహిళల(Afghan women work) విధులకు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
'రియల్ఎస్టేట్' లెక్కలతో మూడో విడత స్విస్ బ్యాంక్ డేటా!
భారత్‌కు సంబంధించిన స్విస్ బ్యాంకు ఖాతాల(swiss bank account) మూడో విడత సమాచారం.. స్విట్జర్లాండ్ నుంచి ఈ నెలలో అందనుంది. ఇందులో తొలిసారిగా స్థిరాస్తులు కల్గిన భారతీయుల డేటా కూడా ఉండనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Ind vs Eng: ఐసీసీ కోర్టులో 'ఐదో టెస్టు'
టీమ్ఇండియా, ఇంగ్లాండ్(fifth test india vs england 2021) మధ్య రద్దయిన ఐదో టెస్టు భవితవ్యాన్ని తేల్చాల్సిందిగా ఈసీబీకి లేఖ రాసింది ఐసీసీ. ఈ సమస్యపై ఐసీసీ వివాద పరిష్కార కమిటీ సరైన నిర్ణయం తీసుకుంటే బీమా క్లెయిమ్ చేసుకునే వీలుంటుందని బోర్డు భావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రామోజీ ఫిల్మ్‌సిటీలో నాగ్ 'బంగార్రాజు'!
నాగార్జున,నాగచైతన్య నటిస్తున్న 'బంగార్రాజు' (Bangarraju movie Naga Chaitanya) సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇటీవల కర్ణాటకలో కొన్ని సన్నివేశాలను షూట్ చేసిన చిత్ర బృందం.. రామోజీ ఫిల్మ్ సిటీలో(Bangarraju movie shooting location) మరిన్ని సీన్లను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.