ETV Bharat / state

మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు - వయో పరిమితిపై లోకేశ్ ఏమన్నారంటే! - MINISTER NARA LOKESH ON MEGA DSC

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామన్న మంత్రి లోకేశ్

Minister Nara Lokesh On Mega DSC 2024
Minister Nara Lokesh On Mega DSC 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2024, 1:15 PM IST

Updated : Nov 15, 2024, 3:40 PM IST

Minister Nara Lokesh On Mega DSC 2024 : వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఆయన ప్రసంగించారు. గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ నియామకాలు సున్నా అని విమర్శించారు. గత ప్రభుత్వంలో డీఎస్సీ (DSC) ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత వదిలేశారని అన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి సంతకమే మెగా డీఎస్సీపైనే చేశామని గుర్తు చేశారు. మొత్తం 16,345 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్టు శాసనసభకు వెల్లడించారు. టీడీపీ హయాంలో మొత్తంగా 15 సార్లు డీఎస్సీ నిర్వహించామని వెల్లడించారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకు వయో పరిమితిని పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

పెండింగ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తాం - రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తి : లోకేశ్

గత ప్రభుత్వ హయాంలో 6 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారని లోకేశ్ ఆరోపించారు. ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకునేందుకు తమ ప్రభుత్వ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాలతో గత ఐదు నెలలుగా చర్చిస్తూనే ఉన్నామన్నారు. జీవో 117 కు ప్రత్యామ్నాయం చేస్తామన్నారు. ఎక్కడా వేధింపులు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యం అన్నారు. అలాగే పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫొటోలు తీయటం ఉపాధ్యాయుల బాధ్యత కాదని ఇప్పటికే తేల్చి చెప్పామన్నారు. ఉపాధ్యాయులపై వైఎస్సార్సీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్‌లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామని తెలిపారు.

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్​లు ఏర్పాటు : గత ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం నిర్వహించకుండా హై స్కూల్ ప్లస్ అంటూ జూనియర్ కళాశాలలను మార్చిందని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇంటర్​కు, పాఠశాల విద్యకూ తేడా ఉందని మంత్రి శాసనసభలో అన్నారు. దీనిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం ఇంటర్​లో అడ్మిషన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ప్రైవేటు జూనియర్ కళాశాలలతో పోటీ పడేలా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తయారు చేసేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు.

నిరుద్యోగులారా సిద్ధమా - వచ్చే నెలలో భారీ నోటిఫికేషన్

మంత్రి నారాయణ నిర్వహిస్తున్న కళాశాలల నుంచి అనుభవాలను కూడా తీసుకుని కార్యాచరణ చేపడతామని అన్నారు. డిసెంబరు మొదటి వారంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్​లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శాసనసభ్యులు కూడా ఈ సమావేశాలకు హాజరు కావాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 50 శాతం కూడా అడ్మిషన్ల రేటు లేదని అన్నారు. ఫ్యాకల్టీ సరిగా లేకపోవటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవటంతో విద్యార్ధులు ఆసక్తి చూపటం లేదని అన్నారు. దీనిని మెరుగు పరుస్తామని స్పష్టం చేశారు.

విమర్శలకు తావులేకుండా మెగా డీఎస్సీ నిర్వహించాలి - అధికారులను ఆదేశించిన మంత్రి లోకేశ్ - Nara Lokesh Review With Officials

Last Updated : Nov 15, 2024, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.