ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - andhrapradesh updates

.

Top News 7 PM
Top News 7 PM
author img

By

Published : Jul 8, 2020, 6:57 PM IST

  • సున్నా వడ్డీ పథకంపై బకాయిలను సున్నా చేస్తున్నాం: సీఎం

సున్నా వడ్డీ పథకం కింద నగదును ఇకపై నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం జగన్‌ చెప్పారు. 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. నాలుగైదు రోజులు ఆలస్యమైనా రైతులు కంగారుపడవద్దని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఈ ప్రభుత్వం రైతు దగా దినోత్సవాన్ని నిర్వహించాలి: చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు దగా దినోత్సవాన్ని నిర్వహిస్తే బాగుంటుందని.. పార్టీ సీనియర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఎస్​ఈసీ కేసులో పూర్తి విచారణకు సిద్ధం కావాలని సుప్రీం చెప్పింది'

నిమ్మగడ్డ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు... పూర్తిస్థాయి విచారణ అనంతరం తుది తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దేశ సర్వోన్నతన్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం... తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రఘురామకృష్ణరాజుపై మంత్రి రంగనాథరాజు ఫిర్యాదు.. తప్పుబట్టిన ఎంపీ

తనపై ఎంపీ రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి శ్రీరంగనాథరాజు పశ్చిమగోదావరి జిల్లా పోడూరు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఎంపీ వ్యాఖ్యలు తనకు పరువునష్టం కలిగించాయని పేర్కొన్నారు. ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • గుడ్ న్యూస్: ఆగస్టు వరకు పీఎఫ్ భారం​ కేంద్రానిదే

కేంద్ర మంత్రివర్గం చిరుద్యోగులకు ఊరట కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు వరకు ఉద్యోగి, యజమానుల ఈపీఎఫ్ భారాన్ని (12+12 శాతం)... గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద కేంద్రమే భరించే ప్రతిపాదనను ఆమోదించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'మోదీ జీ.. బెదిరింపులకు అందరూ లొంగరు'

రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​కు విరాళాలపై కేంద్రం విచారణకు ఆదేశించడంపై ట్విట్టర్​లో స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. ప్రపంచమంతా తనలానే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని విమర్శించారు. ప్రలోభాలు, బెదిరింపులతో అందరినీ భయపెట్టలేరని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అమెరికా 'ఏకపక్షవాదానికి' అది నిదర్శనం: చైనా

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) నుంచి వైదొలగాలని అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని చైనా తప్పుపట్టింది. ఈ చర్య అమెరికా ఏకపక్షవాదానికి నిదర్శనమని విమర్శించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భారీగా పెరిగిన బంగారం ధర- నేటి లెక్కలివే...

అంతర్జాతీయంగా ధరల పెరుగుదల, రూపాయి విలువ తగ్గటం వల్ల బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 723 పెరిగి.. రూ 49,175కు చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 4 నెలల విరామం తర్వాత ప్రారంభమైన క్రికెట్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లండ్

కరోనా సంక్షోభం తర్వాత అంతర్జాతీయ క్రికెట్​ తిరిగి ప్రారంభమైంది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ టెస్టు సిరీస్​కు సిద్ధమయ్యాయి. సౌథాంప్టన్​​ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్​ గెలిచి బ్యాటింగ్​​ ఎంచుకుంది ఇంగ్లీష్​ జట్టు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆ విషయంలో తాప్సీ తర్వాత విద్యాబాలన్​

కరోనాతో దాదాపు మూడునెలలపాటు నిలిచిపోయిన చిత్రీకరణలు, ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బాలీవుడ్​ నటి విద్యాబాలన్​.. తాను షూటింగ్​లో పాల్గొన్నట్లు తెలిపింది. ఆ ఫొటోను ఇన్​స్టోలో పోస్ట్ చేసింది. 'బ్యాక్​ టు వర్క్' అనే వ్యాఖ్యను జోడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.