- వైకాపాలో వర్గ విబేధాలు
శ్రీకాకుళం జిల్లా పొందూరులో సభాపతి తమ్మినేని సీతారాం సమక్షంలోనే.. పార్టీ నేతలు ఘర్షణ పడ్డారు. వర్గాలుగా విడిపోయారు. పొందూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా తలెత్తిన ఈ గొడవ.. పోలీసుల జోక్యంతో చల్లబడింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- అక్టోబర్‌లో టన్నెల్ ద్వారా సాగునీరు..
రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్.. అధికారులతో సమీక్షించారు. అక్టోబర్‌లో అవుకు టన్నెల్ ద్వారా సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. గడువు నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- అచ్చెన్న ప్రాణాలతో చెలగాటం
ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అచ్చెన్నాయుడిని అర్థరాత్రి డిశ్ఛార్జ్ చేయడానికి జరిగిన యత్నంపై.. తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 24 గంటల్లో 22 మంది బలి
బిహార్‌లో 24 గంటల వ్యవధిలో పిడుగుపాటుకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- పరీక్షలు రద్దు
జులై 1-15 మధ్య జరగాల్సిన సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించలేమని చెప్పినట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'మహా' నిషేధం- బాబాకు వార్నింగ్
కరోనా ఔషధం పేరిట పతంజలి ఆవిష్కరించిన 'కరోనిల్' అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వెంటనే ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మళ్లీ కరోనా భయాలు... నష్టాలు
ఒడుదొడుకుల ట్రేడింగ్‌లో చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. గురువారం సెషన్లో సెన్సెక్స్ 27 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 16 పాయింట్లు తగ్గింది. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు ప్రధాన కారణం. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- వ్యాక్సిన్ ముందుగా అందేదెవరికి?
కరోనా వైరస్‌పై పోరులో వ్యాక్సిన్ ఎంతో కీలక పాత్ర పోషించనుందని అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే అనేక దేశాలు దీనిపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నాయి. మరి వ్యాక్సిన్ కొనుగొన్న అనంతరం అది ముందుగా ఎవరికి అందుతుంది? మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- సుశాంత్ చివరి చిత్రం.. విడుదల ఖరారు
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఆత్మహత్య చేసుకుని అభిమానుల్ని శోకసంద్రంలో ముంచిన ఈ హీరో నటించిన 'దిల్ బెచారా' జులై 24న విడుదల కానుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- కొబ్బరి బొండం కోసం వెళ్తే.. కారు సీజ్ చేశారు
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నై నగరంలో ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించడమే ఇందుకు కారణం. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి