ETV Bharat / city

ప్రధానవార్తలు@ 1PM

.

author img

By

Published : Jul 9, 2020, 12:59 PM IST

TOP NEWS
TOP NEWS
  • కరోనా బాధితురాలి పరారీ

అనంతపురం ఆసుపత్రి నుంచి ఓ కరోనా బాధితురాలు బయటకు వెళ్లిపోయింది. ఉరవకొండకు కాలినడకన వెళ్తూ.. మార్గమధ్యలో స్పృహ కోల్పోయింది. విషయాన్ని 108 సిబ్బందికి తెలిపినా ఎవరూ స్పందించలేదు. చివరకు ఎస్పీ ఆదేశాలతో ఎస్సై ఆమెను ప్రైవేటు వాహనంలో ఐసోలేషన్​ వార్డుకు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఫిర్యాదుల వెల్లువ

పశ్చిమగోదావరి జిల్లా వైకాపాలో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైకాపా ఎమ్మెల్యేలు వరుసపెట్టి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు బాటలోనే... మరో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా రఘురామపై భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అవగాహనపై సర్వే

కరోనా అంటే ప్రమాదకరమనే అవగాహన ఉంది. కానీ ఏయే పద్ధతుల్లో ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందనే విషయం చాలామందికి తెలియదు. గొలుసు కట్టు వ్యాప్తిని ఎలా నిరోధించాలనే అంశాలపైనా ప్రజలకు అవగాహన కల్పిస్తే... సామాజిక వ్యాప్తిని కొంతవరకైనా నివారించగలమని ఓ అధ్యయనం చెబుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఘరానా మొగుడు

కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. తన భార్యను హనీమూన్​కు తీసుకెళ్లాడు. అనంతరం తన ప్రియురాలిని కూడా అక్కడికే చేర్చాడు. ఇద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అద్దె అడిగాడని హత్య

తమిళనాడు కుండ్రటూరులో ఘోరం జరిగింది. ఇంటి అద్దె అడిగిన యజమానిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'అగ్ర' ప్రభుత్వంతో చర్చలు

కనీసం ఒక కోర్సుకైనా వ్యక్తిగతంగా హాజరుకావాలన్న నూతన వీసా నిబంధనలతో.. భారతీయ విద్యార్థుల్లో తీవ్ర అనిశ్చితి నెలకొనే అవకాశముందని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం అభిప్రాయపడింది. ఈ అంశంపై అగ్రరాజ్య అధికారులతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉద్యోగాలు 'గగన'మే

కరోనా సంక్షోభంతో విమానయాన రంగం తీవ్రంగా కుదేలైంది. దీనితో దిగ్గజ సంస్థలు కూడా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన యునైటెడ్​ ఎయిర్​లైన్స్ 36 వేల మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించేందుకు కసరత్తు చేస్తోంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మహీకి ఆ ఆలోచన లేదు

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్​పై స్పందించాడు అతడి మేనేజర్, చిన్ననాటి స్నేహితుడు మిహిర్ దివాకర్. మహీకి క్రికెట్​కు వీడ్కోలు పలకాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో సత్తా చాటేందుకు తన ఫామ్​ హౌస్​లో బాగా శ్రమిస్తున్నాడని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కివీస్ మహిళా జట్టుకు కెప్టెన్​గా సోఫీ డివైన్​

గతసీజన్​లో న్యూజిలాండ్​ మహిళా క్రికెట్​ జట్టుకు తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన సోఫీ డివైన్​ను పూర్తి కాల కెప్టెన్​గా ప్రకటించింది కివీస్ క్రికెట్ బోర్డు. దీంతోపాటు మాతృత్వ సెలవులు తీసుకుని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మరో కీలక క్రికెటర్​ అమీ శాటర్త్‌ వైట్‌కు వైస్​ కెప్టెన్​ బాధ్యతలు అప్పగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు జగదీప్(81) అలియాస్‌ సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ తుదిశ్వాస విడిచారు. ముంబయి బాంద్రాలోని ఆయన నివాసంలో ఆరోగ్య సమస్యలతో బుధవారం రాత్రి 8:30 గంటలకు కన్నుముశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.