Maoist leader Vijayakka surrendered in police: మావోయిస్టు అగ్రనేత అలూరు ఉషారాణి అలియాస్ విజయక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. 31 సంవత్సరాలు ఆజ్ఞాతంలో ఉన్న విజయక్క అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. విద్యాభ్యాసం సమయంలోనే పీపుల్స్ వార్ అనుబంధ గ్రూప్స్‌లో పనిచేసిన విజయక్క 1991లో దళంలో చేరారు.
మొబైల్ పొలిటికల్ టీచర్‌గా దండకారణ్యంలో సేవలందించిన ఉషారాణి. మావోయిస్టు పొలిటికల్ మ్యాగజైన్స్‌కు ఎడిటర్ గా పనిచేశారు. 2019 లోనే అనారోగ్యం కారణంగా లొంగి పోతానని పార్టీని ఆమె అభ్యర్థించింది. మావోయిస్టుల్లో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని.. లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా అన్ని సహాయ చర్యలు అందిస్తామని డీజీపీ తెలిపారు. ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా పనిచేసిన రామన్న భార్య రావుల సావిత్రి(46) పోలీసుల ఎదుట లొంగిపోయారు.
''31 సంవత్సరాలు ఆజ్ఞాతం జీవితం గడిపిన ఉషారాణి అలియాస్ విజయక్క ఈరోజు తెనాలి.. గుంటురు జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈమెకి అనేక కేసుల్లో సంబంధం ఉంది. మావోయిస్టుల్లో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా అన్ని సహాయక చర్యలు అందిస్తామని హామీ ఇస్తున్నాం''- తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
ఇవీ చదవండి: