ETV Bharat / city

Tomoto Price Hike: మోతెక్కుతోన్న టమాట ధర... జంకుతున్న సామాన్యులు - Tomoto latest price

టమాటా ధర మోతెక్కుతోంది. తెలంగాణలోని వరంగల్‌లో కేజీ వంద దాటి... 120 రూపాయాల వరకు చేరింది. వినియోగదారులు టామాటా కొనేందుకే వెనకడుగువేస్తున్నారు. పావుకిలో అరకిలో కొనుగోలు చేసి పరమానందం పొందుతున్నారు.

tomoto-rates-increasing-day-by-day
మోతెక్కుతోన్న టమాట ధర... జంకుతున్న సామాన్యులు
author img

By

Published : Nov 26, 2021, 10:14 AM IST

మోతెక్కుతోన్న టమాట ధర... జంకుతున్న సామాన్యులు

Tomoto Price Hike: ఉల్లిపాయ లేకుండా కూర ఎంత కష్టమో... టమాటా లేకున్నా అంతే. కూరలో టమాటా (Tomoto) వేస్తే ఇద్దరికి సరిపోయేది నలుగురికి సరిపోతుంది. అందుకే వినియోగదారులు మార్కెట్‌కు వచ్చినప్పుడల్లా కచ్చితంగా రెండు మూడు కేజీల చొప్పున టమాటాలు (Tomoto Price Hike) కొనుగోలు చేస్తారు. అయితే ఇదంతా నిన్నటి మాట. కిలో కాదు పావుకిలో టమాటా కొనాలంటే జంకే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్ మార్కెట్లలో కిలో టమాటా వంద దాటేసింది. కాస్త బాగున్న టమాటా అయితే... నూట పది నుంచి నూట ఇరవై వరకు పలుకుతోంది.

150 దాటేలా...

వర్షాలతో చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి టమాటా (Tomoto) సరఫరా కాకపోవడం వల్ల వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. తప్పనిసరి పరిస్ధితుల్లో పావుకిలో అరకిలోతో జనం సరిపెట్టుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే... మరో వారం పది రోజుల్లో రూ. 150 (Tomoto Price Hike) కూడా దాటేసే అవకాశాలు లేకపోలేదు.

ఇతర కూరగాయలు కూడా...

టమాటాతో (Tomoto Price Hike) పాటుగా ఇతర కాయగూరలు మేమేం తక్కువా అన్నట్లుగా పెరుగుతున్నాయి. టమాటా ధర పెరగడం వల్ల వినియోగం తగ్గుతోందని చిరు వ్యాపారులు చెబుతున్నారు. వర్షాల కారణంగా మదనపల్లె నుంచి సరఫరా జరగట్లేదని... వారంటున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.