హైదరాబాద్లోని ప్రగతిభవన్ వేదికగా రేపు తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు సహా విభజనాంశాలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సమావేశంలో పాల్గొంటారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు విషయమై భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. జలాల తరలింపునకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రులు చర్చించారు.
ఇంజినీర్ల కమిటీలు...
సీఎంల నిర్ణయానికి అనుగుణంగా ఇరు రాష్ట్రాల ఇంజినీర్ల కమిటీలు గతంలో ఉమ్మడిగా, విడివిడిగా చర్చించాయి. జలాల తరలింపునకు సంబంధించి వివిధ ప్రతిపాదనలను రూపొందించి పరిశీలించారు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను ఇంజినీర్లు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై రేపటి సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు చర్చిస్తారు. దీంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సహా ఇతర సమస్యలపై కూడా ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చిస్తారు.
ఇదీ చూడండి : భారత్ గురించే 30 నిమిషాల పాటు ట్రంప్ ప్రసంగం