సీఎం జగన్ అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. కౌలు రైతులకు రుణాల పంపిణీపై బ్యాంకర్లతో చర్చించనున్నారు. ప్రస్తుత ఖరీప్ సీజన్లో రూ.24 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని.. అక్టోబరు 15 నుంచి రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బ్యాంకర్ల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రైతు భరోసా కింద ఇచ్చే రూ.15,500ను ఇతర రుణాల కింద జమ చేయవద్దని ఆదేశించింది. ఈ విషయాన్ని బ్యాంకులకు స్పష్టం చేసింది. రేపు జరిగే సమావేశంలో రుణాలపై మరింత స్పష్టత రానుంది.
ఇవాళ బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం - బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం
ఇవాళ సచివాలయంలో బ్యాంకర్లతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం కానున్నారు. కౌలు రైతులకు రుణాల పంపిణీపై చర్చించనున్నారు.
సీఎం జగన్ అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. కౌలు రైతులకు రుణాల పంపిణీపై బ్యాంకర్లతో చర్చించనున్నారు. ప్రస్తుత ఖరీప్ సీజన్లో రూ.24 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని.. అక్టోబరు 15 నుంచి రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బ్యాంకర్ల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రైతు భరోసా కింద ఇచ్చే రూ.15,500ను ఇతర రుణాల కింద జమ చేయవద్దని ఆదేశించింది. ఈ విషయాన్ని బ్యాంకులకు స్పష్టం చేసింది. రేపు జరిగే సమావేశంలో రుణాలపై మరింత స్పష్టత రానుంది.
చిత్తూరు జిల్లా వాల్మీకిపురం పట్టాభిరాముడి ఆలయంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. భరత, లక్ష్మణ, శత్రుఘ్న సోదర సమేతంగా వెలసి ఉన్న పట్టాభి రామాలయం భూమండలంపై ప్రదమoగా ఇక్కడ వెలుగొందుతోంది. పరమ భక్తుడు జాంబవంతుడు, రామాయణ వ్యాఖ్యాత వాల్మీకి మహర్షి వారు తపమాచరించిన ఈ దివ్య క్షేత్రంలో శ్రీ పట్టాభిరామ స్వామి వారు యోగ భంగిమలో ఉత్తరముఖంగా ఇక్కడ ఉన్నారు. ఉత్తర ముఖంగా భగవద్దర్శనం చేస్తే శ్రీమన్నారాయణ దర్శనంతో సమానమని పెద్దలు చెబుతారు. ఈ క్షేత్రంలో పట్టాభిరామ స్వామి వారు ఉత్తర ముఖంగా వెలిసి ఉన్న రామ దర్శనం నిత్య వైకుంఠ నారాయణ దర్శనంగా చెబుతారు. శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రతి మాసంలోనూ ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఇక్కడి పట్టాభిరామ స్వామి వారికి మూడు మార్లు కళ్యాణం జరిపిస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. తొలి తెలుగు వాగ్గేయ కారుడు పద కవితా పితామహుడు అన్నమాచార్యుల వారు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరాముని క్షేత్రాన్ని దర్శించి శ్రీరామచంద్ర ప్రభువు పై పలు కీర్తనలు చేశారు. టీటీడీ దేవస్థానం ఆలయ ప్రాముఖ్యతను గుర్తించి 20 ఏళ్ల కిందట దత్తత తీసుకుంది.
నాటి పవిత్రోత్సవాలు, ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు, సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సీతారాముల కళ్యాణాన్ని భక్తులు పాల్గొని తరించారు...
వాయిస్... ఆలయ అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు
Body:సీతారాముల కళ్యాణం
Conclusion:చిత్తూరు జిల్లా వాల్మీకిపురం పట్టణం లో వెలసిన పట్టాభి రామాలయంలో శ్రీ సీతా రాముల వారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.