దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే ఫీజుకు మినహాయింపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 18 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఎన్. హెచ్.ఏ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. టోల్ ప్లాజాల ఫీజును స్వల్పంగా పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'పిల్లల్లో కరోనా వ్యాప్తి తక్కువేనని అంచనాలు చెప్తున్నాయ్'