AP Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ప్రస్తుతం ఇది అండమాన్ తీరానికి దగ్గరగా ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి.. తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
అండమాన్ తీరం నుంచి ఉత్తర- ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలకు చేరుకుంటుందని వాతావరశాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు రాయలసీమ జిల్లాల్లో ఒకటీ రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది.
ఇదీ చదవండి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయం: నాదెండ్ల మనోహర్