ETV Bharat / city

నేడే తెరాస, భాజపా అభ్యర్థుల నామినేషన్.. నెలాఖరులో భారీ బహిరంగ సభలకు ప్లాన్స్!

author img

By

Published : Oct 10, 2022, 10:25 AM IST

Today is TRS BJP munugode election nomination: తెలంగాణలో రసవత్తంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ముఖ్య ఘట్టానికి చేరుకుంది. నేడు తెరాస, భాజపా అభ్యర్థుల నామినేషన్లు వేయనున్నారు. కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి మాత్రం ఎప్పుడు నామినేషన్​ వేస్తారో ఇంకా అధిష్ఠానం నిర్ణయించలేదు.

TRS BJP munugode election nomination
మునుగోడు ఉపఎన్నిక

Today is TRS BJP munugode election nomination: తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలిచి తెరాస, భాజపా అభ్యర్థులు ఇవాళ నామినేషన్‌ వేయనున్నారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ ఎన్నికలపై ఎన్నికల సంఘం గట్టి నిఘా పెట్టినందున నామినేషన్ల కార్యక్రమం మునుగోడులో సాదాసీదాగానే నిర్వహించాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. సీపీఎం, సీపీఐ ముఖ్యనాయకులతో కలిసి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ను సమర్పించనున్నారు. నామినేషన్ల చివరి రోజైన ఈ నెల 14న మరో సెట్‌ నామినేషన్‌ వేయనున్నట్లు తెలిసింది.

భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఉదయం 11 గంటలకు నామపత్రం సమర్పించనున్నారు. మునుగోడు నుంచి చండూరు వరకు భారీ ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. నామినేషన్‌ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌తో పాటూ స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ వివేక్, ఈటల రాజేందర్‌, కేంద్రమంత్రులు కిషన్​రెడ్డి, భుపేంద్ర యాదవ్​, లక్ష్మణ్​, డీకే. అరుణ హాజరుకానున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.