ETV Bharat / city

వందేళ్ల తర్వాత రాష్ట్రంలో భూముల సర్వే..నేడు ప్రారంభం - ఏపీ సీఎం జగన్ వార్తలు

రాష్ట్రంలో దాదాపు వందేళ్ల తర్వాత భూముల రీసర్వే నేడు ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో ఈ ఉదయం 10 గంటలకు సీఎం జగన్ లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మూడు దశల్లో సమగ్ర భూ సర్వే చేపట్టి.. 2023 జనవరి నాటికి రాష్ట్రమంతటా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. తొలి దశ నేటి నుంచి ప్రారంభం కాగా.... సర్వే పూర్తవగానే రికార్డులను గ్రామ సచివాలయాల్లో పొందుపరుస్తారు.

today cm jagan
today cm jagan
author img

By

Published : Dec 21, 2020, 2:48 AM IST

Updated : Dec 21, 2020, 3:42 AM IST

వందేళ్ల తర్వాత రాష్ట్రంలో భూముల సర్వే..నేడు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే కోసం నిర్దేశించిన ‘'వైఎస్​ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష' పథకం నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టి రీసర్వే పూర్తి చేశారు. ఇక్కడ పొలాలల్లో సరిహద్దు రాయి పాతి... సీఎం జగన్ ఈ పథకానికి శ్రీకారం చుడతారు. అనంతరం జగ్గయ్యపేటలో నిర్వహించే బహిరంగసభలో సీఎం పాల్గొంటారు.

తక్కెళ్లపాడులో రీ సర్వేను ప్రయోగాత్మకంగా చేపట్టగా...వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రం మొత్తం విస్తరిస్తారు. సమగ్ర సర్వేకు ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీచేశారు. జిల్లాల కలెక్టర్లు ఉచిత రీ-సర్వే జరిగే గ్రామాల్లో నోటిఫికేషన్‌ ఇచ్చి... తేదీల వారీగా ఏయే గ్రామాల్లో జరుగుతుందనే వివరాలు ప్రకటిస్తారు. ఇప్పటికే సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో ఇంత భారీ ఎత్తున భూముల రీ సర్వే చేయడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. ఈ సర్వేలో కొలతలు కచ్చితంగా ఉంటాయని, తేడా చాలా సూక్ష్మస్థాయిలో 2 సెంటీ మీటర్లకు అటూ ఇటూ మాత్రమే ఉంటుందంటున్నారు. కార్స్‌ పరిజ్ఞానం, డ్రోన్లు, రోవర్లు వంటి అత్యాధునిక సదుపాయాలను ఈ సర్వే కోసం వినియోగిస్తారు.

విడతల వారీగా....

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా 26 వేల చదరపు కిలోమీటర్ల మేర సర్వే చేస్తారు. తొలి విడతలో 5 వేలు, మలివిడతలో 6వేల 500, మూడో విడతలో 5వేల 500 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. తొలి విడతకు నోటిఫికేషన్లను వెంటనే జారీచేయనున్నారు. తొలిదశ సర్వే 2021 జులై వరకు జరగనుండగా.... 2021 ఆగస్టు నుంచి మొదలయ్యే మలిదశ సర్వే.. 2022 ఏప్రిల్‌ వరకు కొనసాగుతుంది. మూడో దశ సర్వే...2022 జులై నుంచి మొదలై 2023 జనవరికి పూర్తవుతుంది. మొదటి విడత పూర్తయి రెండో విడత ప్రారంభమయ్యేలోపే సంబంధిత గ్రామ సచివాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి.

ప్రత్యేక సంఖ్యతో కార్డు...

గత వందేళ్లుగా నమోదుకాని సబ్‌ డివిజన్లు, పంపకాలనూ రికార్డుల్లోకి ఎక్కిస్తారని.... పొలాల్లో సరిహద్దు రాళ్లు వేస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక సంఖ్యతో రైతుకు ఒక కార్డు ఇస్తామంటున్నారు. దానిలో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని..హార్డ్‌ కాపీ కూడా అందిస్తామంటున్నారు. రికార్డులన్నీ డిజిటల్‌ రూపంలోకి మార్చి... గ్రామాలకు సంబంధించిన మ్యాపులూ అందుబాటులోకి తెస్తామంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వే రికార్డులు ఉంచి... అక్కడే రిజిస్ట్రేషన్‌, సమీకృత రెవెన్యూ సేవలు అందిస్తామని చెబుతున్నారు.

మెుబైల్ మేజిస్ట్రేట్ బృందాలు...

రీ-సర్వే నిర్వహణకు రాష్ట్రంలో 650 మొబైల్‌ మేజిస్ట్రేట్‌ బృందాలు ఏర్పడనున్నాయి. తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే లేకుంటే మండల సర్వేయర్‌ బృందంలో సభ్యులుగా ఉంటారు. రీ-సర్వేలో వచ్చే సమస్యలను ప్రాథమికంగా ఈ బృందాలు పరిష్కరించాల్సి ఉంటుంది. సరిహద్దు రాళ్ల పంపిణీని ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేస్తారు. విజయవాడ, పెడన, జగ్గయ్యపేట, తిరువూరు, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిల్లో బేస్‌స్టేషన్లు ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 బేస్‌స్టేషన్లను వచ్చే నెల 15 నాటికి ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

సర్వేయర్లకు శిక్షణ...

రాష్ట్రంలోని 14 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. సర్వే బాధ్యతలన్నీ కలెక్టర్లే దగ్గరుండి చూసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రస్థాయిలో ల్యాండ్‌ టైటిలింగ్‌ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. జిల్లా స్థాయిలో ట్రైబ్యునళ్లు, విశ్రాంత న్యాయమూర్తులతో అప్పిలేట్‌ ట్రైబ్యునళ్లను వెంటనే ఏర్పాటు చేస్తారు. డ్రోన్ల ద్వారా సర్వే ప్రారంభించే సమయానికి గ్రామాల సరిహద్దుల్ని నిర్ణయించి, మార్కింగ్‌లు పూర్తి చేస్తారు.. ప్రతి మండలంలో ఒక డ్రోన్‌ టీం, డాటా ప్రాసెసింగ్‌, రీ సర్వే టీంలు ఉంటాయి. సర్వేపూర్తయ్యాక అది పొలమైనా, స్థలమైనా, ఏ స్థిరాస్తి అయినా..దాని మీద ఒక టైటిల్‌ ఇచ్చిన తర్వాత రెండేళ్లపాటు గ్రామ సచివాలయంలో పరిశీలన కోసం ఉంచుతారు. దానిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని కోరతారు. రెండేళ్ల తర్వాత ఆ టైటిల్‌కు శాశ్వత భూమి హక్కు లభిస్తుంది. టైటిల్‌ ఖరారు చేసిన తర్వాత అభ్యంతరాలుంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుంది.

ఇదీ చదవండి

ఆకాశంలో అద్భుతం..397 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు !

Last Updated : Dec 21, 2020, 3:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.