రాష్ట్రంలో నేడు పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశపరీక్ష పాలిసెట్ జరగనుంది. మొత్తం 316 పరీక్షా కేంద్రాల్లో 74,853 మంది ఈ పరీక్ష రాయనున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు ఉదయం 9.30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సాంకేతిక విద్యా కమిషనర్ పోలా భాస్కర్ సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రవేశపరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని పరీక్షా కేంద్రాలవద్ద భద్రతా ఏర్పాట్లతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
ఉదయం 11 గంటల తర్వాత వచ్చినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు. పరీక్ష రాసే విద్యార్ధులు మాస్క్ , హ్యాండ్ గ్లౌజ్ ధరించడంతో పాటు శానిటైజర్ తెచ్చుకోవాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్కాన్ ఏర్పాటు చేయటంతో పాటు హ్యాండ్ శానిటైజర్స్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థికి విద్యార్థికి మధ్య భౌతిక దూరం ఉండేలా సిటింగ్ ఏర్పాట్లు చేయటంతో పాటు స్పెషల్ ఐసోలేషన్ రూమ్స్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వలన హాల్ టిక్కెట్లు లేకపోతే విద్యార్ధులు అందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలను చూపించిన వారికి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: