తిరుపతి ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి సూచించారు. కేంద్ర మాజీ మంత్రి, తెదేపా తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ దంపతులు.. చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. తిరుపతి ఉపఎన్నికకు అభ్యర్థిగా ఆమెను ఇటీవలే ప్రకటించగా.. మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలో గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. త్వరలోనే తిరుపతిలో ఆమె ప్రచారం ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి: