ETV Bharat / city

24 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు - తితిదే తాజా వార్తలు

తిరుమలలో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకల కారణంగా... మార్చి 24, 25, 26, 27, 28 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ (వర్చువల్ ‌సేవ), 26, 27, 28 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవాలను తితిదే రద్దు చేసింది.

tirumala salakatla teppotsavam
24 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
author img

By

Published : Mar 11, 2021, 8:41 AM IST

తిరుమలలో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఈ వేడుక నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ సీతారామచంద్రమూర్తి, రెండోరోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు తిరుమాఢవీధుల్లో ప్రదక్షిణగా విహరించి.. చివరికి పుష్కరిణిలో తెప్పపై విహరిస్తారు.

చివరి మూడు రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తెప్పపై విహరించి భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల కారణంగా ఈనెల 24, 25, 26, 27, 28 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ (వర్చువల్‌ సేవ), 26, 27, 28 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవాలను తితిదే రద్దుచేసింది.

ఇదీ చదవండి:

పరమేశ్వరుడికి కేవలం లింగరూపమేనా.. ఇతర రూపాలు లేవా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.