మీ కురులు ఒత్తుగా(THICK HAIR), పొడవుగా(LONG HAIR) పెరగాలన్నా... ఆరోగ్యంగా(HEALTHY HAIR) ఉండాలన్నా ఈ కింద సూచించే పద్ధతులను పాటిస్తే.. సరి.
మాడు, వెంట్రుకలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి..
- దిండు గలేబులను తరచూ మార్చాలి. ఎందుకంటే జుట్టుకు ఉండే నూనె(HAIR OIL), చుండ్రు వీటిపై పడటమే కాకుండా తిరిగి మళ్లీ తలలోకే చేరే అవకాశం ఉంటుంది.
- ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయకండి. దీంతో చాలా ఇబ్బందులు వస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా వెచ్చగా ఉండే నీళ్లతో స్నానం చేయొచ్చు.
- కొంతమంది తలస్నానం చేసిన తర్వాత జుట్టును టవల్‌తో గట్టిగా దులుపుతుంటారు. ఇలా చేస్తే వెంట్రుకలు రాలిపోతాయి.
- జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు దువ్వకూడదు. ఇలా చేస్తే చిక్కులు పడిపోయి ఊడిపోతుంది.
- మీ జుట్టు పొడిబారకుండా ఉండేందుకు ప్రతి ఆరు వారాలకు ఒకసారి జుట్టు చివరి భాగాలను కాస్త కత్తిరించుకోండి.
మర్దనలు, పూతలు....
- ప్రొటీన్లు ఉండే గుడ్డుతో అప్పుడప్పుడూ పూత వేసుకుంటూ ఉంటే జుట్టు చక్కగా పెరుగుతుంది. అలాగే కొబ్బరి, బాదం, జొజొబా లాంటి నూనెలతో మర్దనా చేసుకోవాలి. అప్పుడు మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుంది.
- తలస్నానం చేసేటప్పుడు షాంపూ మాత్రమే సరిపోదు. కండిషనర్(CONDITIONERS) వాడాల్సిందే. ఎందుకంటే చాలా రకాల షాంపూలు మీ జుట్టులోని తేమను లాగేస్తాయి. కాబట్టి జుట్టుకు పోషణ, తేమ అందాలంటే కండిషనర్ కావాల్సిందే.
పైపూతలే కాదు.. ఆహారమూ అవసరమే..
- జుట్టు ఒత్తుగా పెరగాలంటే పై పూతలే సరిపోవు. ఆహారం విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. మాంసకృత్తులు, విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి.
1. విటమిన్ ఎ: బంగాళా దుంప, క్యారెట్, గుమ్మడికాయ, బచ్చలికూర, పాలు, గుడ్లు
2. విటమిన్ బి: పప్పులు ముఖ్యంగా మినపపప్పు, శనగపప్పు, పెసరపప్పు, బాదం, మాంసం, చేపలు, పచ్చి ఆకుకూరలు
3. విటమిన్ సి: స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్, సిట్రిక్ అధికంగా పండ్లు, బత్తాయి, నారింజ, సీజనల్ పండ్లు(ఉదా. మామిడి, సపోటా మొదలైనవి)
4. విటమిన్ డి: చేపలు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్డులోని పచ్చసొన, పుట్టగొడుగులు, బలవర్ధక ఆహారం
5. విటమిన్ ఇ: పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, బచ్చలికూర, పాలకూర, వేరుశెనగలు
6. జింక్: బచ్చలికూర, పాలకూర, గుమ్మడి విత్తనాలు, గోధుమలు
7. ప్రోటీన్స్: మాంసం, చేపలు, పాలు
కెఫీన్ కూడా జుట్టు పెరిగేలా చేస్తుంది..
- రోజుకో కప్పు కాఫీ తాగడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు వెంట్రుకలు కూడా పెరుగుతాయి.
- గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్స్ కురుల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కాబట్టి రోజుకి 1-2 సార్లు గ్రీన్ టీ తాగడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కెఫీన్ ఎలర్జీ ఉన్నవారు, రక్తం గడ్డం కట్టకుండా మందులు వాడుతున్నవారు గ్రీన్ టీ తాగకూడదు.
ఇదీ చూడండి: