ETV Bharat / city

పిల్లి అనుకొని సాయం చేయబోయాడు.. ఆసలు విషయం తెలిసి షాక్​..! - Tiger head trapped in a bowl in rangareddy district

పని మీద వెళ్తుంటే చెంబులో తల చిక్కుకుని ఓ పిల్లి పాట్లు పడటం కనిపించింది. వెళ్లి దాని తల బయటకు తీసి సాయం చేద్దామనుకున్నారు ఆ వ్యక్తి. దగ్గరగా వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకోగానే.. చేతిని కరిచింది. ఒక్కసారిగా చూసి అది పిల్లి కాదు చిరుతపులి పిల్ల అని అర్థమై వెంటనే చేతుల్లోంచి కిందకు విసిరేశారు. ఒక్క ఉదుటున ఆ పులిపిల్ల అక్కణ్నుంచి పరుగులు తీసింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?

పిల్లి అనుకొని షర్మిల పార్టీ నాయకుడు సాయం చేయబోతే..

author img

By

Published : Oct 15, 2021, 1:53 PM IST

పిల్లి అనుకొని షర్మిల పార్టీ నాయకుడు సాయం చేయబోతే..

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లి గ్రామంలో.. ఓ మూగజీవి తల.. చెంబులో ఇరుక్కుపోయి బయటకు తీయడానికి తిప్పలు పడుతోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వైఎస్​ఆర్టీపీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆ దృశ్యాన్ని చూశారు. మానవతా దృక్పథంతో ఆయన వాహనం నుంచి దిగి.. దాని వద్దకు వెళ్లారు. తన తల చెంబులో ఇరుక్కుపోయి పిల్లి ఇబ్బంది పడుతోందని భావించి.. దానికి సాయం చేద్దామనుకున్నారు. దగ్గరకు వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకోగానే.. అది ఒక్కసారిగా కరవడంతో చూసి అవాక్కయ్యారు. తన చేతిలో ఉంది పిల్లి కాదు చిరుతపులిపిల్ల అని అర్థమై ఒక్క ఉదుటున కిందకు విసిరేశారు. ఆ పులిపిల్ల రాఘవరెడ్డి చేతిలో నుంచి నాలుగు ఫీట్ల దూరంలోకి దూకి చెట్ల పొదల్లోకి పారిపోయింది.

మరోవైపు అది పులిపిల్ల అని తెలియగానే రాఘవరెడ్డి తన అనుచరులతో సహా అక్కణ్నుంచి పరుగులు తీశారు. అనంతరం స్థానిక పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. పులిపిల్ల రక్కడం వల్ల కొండా రాఘవరెడ్డి స్థానిక ఆస్పత్రికి వెళ్లి వైద్యుల సలహా మేరకు టీటీ ఇంజిక్షన్ తీసుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోందని.. చిరుతతో పాటు దాని పిల్లలను కూడా పట్టుకోవాలని అధికారులను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.