ETV Bharat / city

రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో ఇల్లు

రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో షియర్‌వాల్‌ సాంకేతికతతో జీ+3 అపార్ట్‌మెంట్‌ తరహాలో నిర్మించిన 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 1,43,600 ఇళ్లను.. ప్రభుత్వం ఒక్క రూపాయికే అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారులకు.. టిడ్కో ఇళ్లను అందించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

tidco house is given for one rupee
రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో ఇల్లు
author img

By

Published : Mar 24, 2021, 7:17 AM IST

పురపాలక సంఘాల్లో షియర్‌వాల్‌ సాంకేతికతతో జీ+3 అపార్ట్‌మెంట్‌ తరహాలో నిర్మించిన 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 1,43,600 ఇళ్లను ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 365 చదరపు అడుగులు(చ.అ), 430 చ.అ విస్తీర్ణం కలిగిన ఇళ్లకు లబ్ధిదారుల వాటాలో 50 శాతం రాయితీని వర్తింపజేసింది. 365 చ.అ ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ ఇంటికి రూ.లక్ష తమ వాటాగా లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా ఇందులో 50 శాతం రాయితీకి అనుమతిచ్చింది. ఇప్పటికే పూర్తిగా చెల్లించిన వారికి సగం మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. లబ్ధిదారుని వాటా ఇప్పటికే చెల్లించినప్పటికీ.. వైకాపా ప్రభుత్వ ఇళ్ల పట్టాల పథకం వైపు మళ్లిన వారికి పూర్తి మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు టిడ్కో కాలనీలుగా ఉన్న పథకం పేరును ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన- వైఎస్సార్‌ జగనన్న నగర్‌గా మార్పు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి:

లోపాయికారీ ఒప్పందంతోనే జేపీ వెంచర్స్​కు ఇసుక టెండర్లు: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.