ETV Bharat / city

356 రోజు రాజధాని రైతుల ఆందోళన.. రోడ్డుపై బైఠాయింపు - thullur farmers protest for capital city amaravati news update

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటం 356వ రోజు కొనసాగుతోంది. తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉద్దండరాయుని పాలెంలో అమరావతి మహిళలపై రాళ్ల దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు.

thullur farmers protest for capital city
356 రోజు రాజధాని రైతులు ఆందోళన
author img

By

Published : Dec 7, 2020, 11:33 AM IST

Updated : Dec 7, 2020, 12:52 PM IST

356 రోజు రాజధాని రైతులు ఆందోళన

రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం ఈరోజుతో 356వ రోజుకు చేరుకుంది. తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉద్దండరాయుని పాలెంలో అమరావతి మహిళలపై రాళ్ల దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. మూడు రాజధానుల శిబిరం తొలగించే వరకూ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడికి పాల్పడటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేయకుండా.. ఆందోళనలకు ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు. పెయిడ్ ఆర్టిస్టులతో మూడు రాజధానుల ఉద్యమం నడుస్తోందని.. వారితో తమను తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాజధానిలోని అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతులు రోడ్డుపై ఆందోళన చేస్తుండటంతో తుళ్లూరులో భారీగా పోలీసులు మోహరించారు.

ఇవీ చూడండి...

ప్రభుత్వంపై తెదేపా వ్యాఖ్యలు మానుకోవాలి: ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

Last Updated : Dec 7, 2020, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.