ETV Bharat / city

స్నేహం మాటున చెరబట్టారు.. కటకటాలపాలయ్యారు - rape attempt on girl in kukatpally at telangana

భయపెట్టి ఒకరు.. మభ్యపెట్టి మరొకరు.. స్నేహం ముసుగులో కొందరు.. బరితెగించి మరికొందరు అభం శుభం తెలియని యువతులను కాటేస్తున్నారు. ఎవరికీ తెలియదనో.. ఎవరేం చేస్తారులే అనే తెగింపో మనిషి రూపంలోని మృగాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లో స్నేహం ముసుగున యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదులో కటకటాల్లోకి చేరారు.

three men arrested for drugging raping woman in hyderabad
తెలంగాణ: స్నేహం మాటున చెరబట్టారు.. కటకటాలపాలయ్యారు
author img

By

Published : Oct 17, 2020, 8:15 AM IST

తెలంగాణ: స్నేహం మాటున చెరబట్టారు.. కటకటాలపాలయ్యారు

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి తల్లిదండ్రులతో కలిసి నివాసముంటుంది. సికింద్రాబాద్​లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆమె ఇంటి దగ్గరలో ఉంటున్న... జోసఫ్, నవీన్ రెడ్డి, రాములు... సదరు విద్యార్థినితో స్నేహంగా మెలిగారు.

ఈనెల 5వ తేదీన టర్మ్‌ ఫీజు చెల్లించేందుకు విద్యార్థిని కళాశాలకు వెళ్లింది. ఆ సమయంలో జోసెఫ్ ఫోన్ చేసి... తన పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించాడు. నిజమేనని నమ్మిన సదరు యువతి వారి వెంట వెళ్లింది. కేపీహెచ్​బీ సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లిన నిందితులు... ఆమెతో మత్తుమందు కలిపిన కేక్‌ తినిపించారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

బాధిత యువతి అనారోగ్యానికి గురవ్వడం వల్ల అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో... ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం కింద హైదరాబాద్​ పోలీసుల కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్​ చేశారు. శుక్రవారం సాయంత్రం బాధితురాలి వాంగ్మూలం తీసుకునేందుకు కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​కు తీసుకువచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్​ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు అక్కడే ఆందోళన చేపట్టారు.

లాడ్జి వ్యవహారశైలిపైనా అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హోటళ్లు, లాడ్జీలపై నిరంతర నిఘా ఉంచాలని.. పలువురు కోరుతున్నారు.

ఇవీచూడండి: హైదరాబాద్​లో గ్యాంగ్​రేప్​.. బర్త్​డేకి పిలిచి అత్యాచారం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.