Roads Repair: గుంతలు ఉన్న గ్రామీణ లింక్ రహదారుల మరమ్మతులకు రూ.1,070 కోట్లు కేటాయించామని.. ప్రభుత్వం నుంచి పాలనామోదం వచ్చిన వెంటనే టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సెస్ నిధులు, బ్యాంకు రుణాలతో చేపట్టే ఈ పనులు ప్రారంభించిన ఆరు నెలల్లో ఇవి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు త్వరలో విడుదల చేస్తామన్నారు. సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘రూ.5వేల కోట్ల ఏఐఐబీ నిధులతో చేపట్టే 6,513 కిలోమీటర్ల రహదారులు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో దెబ్బతిన్న 800 కిలోమీటర్ల రహదారులను 2023 నాటికి పూర్తి చేయాలి’ అని వివరించారు.
ఇదీ చదవండి: వ్యక్తిపైకి దూసుకెళ్లిన ద్విచక్రవాహనం.. ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం