ETV Bharat / city

'విమర్శలకు సమయం కాదు... కలిసి పని చేద్దాం'

కరోనాను తరిమికొట్టేందుకు అన్ని పార్టీలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కరోనాను నివారించడమే మనందరి లక్ష్యం కావాలని అన్నారు. పేదలు, కూలీల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. అలాగే ప్రజలు ముందు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని సూచించారు.

this-is-not-the-correct-time-for-criticism-dot-dot-dot-lets-work-together-chandra-babu-says

author img

By

Published : Mar 27, 2020, 6:17 PM IST

Updated : Mar 27, 2020, 6:38 PM IST

హైదరాబాద్​ నుంచి మీడియాతో చంద్రబాబు

కరోనా నివారణకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత బాధ్యత తీసుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సూచించారు. పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. హైదరాబాద్​ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన... ఏపీ ప్రభుత్వం పేదలకు రూ.5 వేల చొప్పున ఇవ్వాలని అన్నారు. వీటితో పాటు నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. లాక్​డౌన్​తో పౌల్ట్రీ రైతులు, పంటలు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రవాణా వ్యవస్థ సరిచేస్తే ప్రజలందరికీ నిత్యవసరాలు అందించవచ్చని అన్నారు. అలాగే నిత్యావసరాలను ఇంటింటికీ సరఫరా చేయాలని హితవు పలికారు. వీటితో పాటు పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా టెస్టింగ్ సెంటర్లు పెంచాలని కేంద్రాన్ని కోరారు.

అదే కరోనాకు ముందు...
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. సామాజిక దూరం పాటించటం వల్లే కరోనా నియంత్రణలో ఉందని అన్నారు. మనుషులకు దూరంగా ఉండటమే కరోనాకు మందు అని చెప్పారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వీయ నియంత్రణ పాటించాలని హితవు పలికారు. శుభ్రత పాటిస్తే కరోనాను చాలావరకు నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలు, సూచనలు పాటించాలని ప్రజలను కోరారు. ఇలాంటి సమయంలో ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని చంద్రబాబు సూచించారు. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు కలిగించకూడదని అన్నారు. పోలీసులు, అధికారులతో ఘర్షణ పడటం సరికాదని స్పష్టం చేశారు.

పూర్తిగా సహకరిస్తాం
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని ఆయా ప్రభుత్వాలు ఆదుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వారి కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత తీసుకోవాలని అన్నారు. పేదలు, కూలీల గురించి ఈ ప్రభుత్వం ఆలోచించాలని హితవు పలికారు. నిపుణులతో సంప్రదించి ప్రణాళిక తయారు చేసుకోవాలని... అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకోవాలని చెప్పారు. అన్ని పార్టీలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విమర్శలు చేసుకునే సమయమిది కాదని, తాము పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కరోనాను నివారించడమే మన లక్ష్యం కావాలని అన్నారు. కష్టసమయంలో ప్రజలంతా సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్​: మూడు నెలల పింఛను​ ఒకేసారి ​వస్తుంది!

Last Updated : Mar 27, 2020, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.