ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా.. మూడోదశ నామినేషన్ల ప్రక్రియ - సర్పంచ్ ఎన్నికల వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా మూడో దశ పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోలాహలంగా సాగుతోంది. కొన్నిచోట్ల అభ్యర్థులు మెుదటిరోజు నామపత్రాల సమర్పణకు అభ్యర్థులు ఆసక్తి చూపలేదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టడంతో ప్రశాంతంగా ప్రక్రియ కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు ముందుగానే ప్రత్యేక నిఘా పెట్టారు.

third phase local election process going
రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా.. మూడోదశ నామినేషన్ల ప్రక్రియ
author img

By

Published : Feb 6, 2021, 6:03 PM IST

గుంటూరు జిల్లాలో..

పల్నాడు ప్రాంతమైన గురజాల డివిజన్ పరిధిలో నేటి నుండి మూడవ దశ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 9 మండలాల పరిధిలో 134 పంచాయతీలకు 1460 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అభ్యర్థుల నుండి అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. తొమ్మిది మండలాల్లో 5 మండల కేంద్రాలు పంచాయతీలు ఉన్నాయి.

గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా పల్నాడుపై ఎన్నికల అధికారి ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు మొబైల్ టీములను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అభ్యర్థులు లేక నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. పోటాపోటీగా అభ్యర్థులు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. కనిగిరి మండలంలోని కంచర్లవారిపల్లి గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రంలో తెదేపా బలపరిచిన అభ్యర్థులు రెండు నామినేషన్ పత్రాలను మాత్రమే దాఖలు చేశారు. మొత్తం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.

కొరిసపాడులో పంచాయతీ ఎన్నికలు జరగనున్న పోలింగ్ బూతులను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ పనులు చేయాలని అధికారులకు సూచించారు.

నెల్లూరు జిల్లాలో..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట, పెళ్లకూరు, సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం, ఓజిలి మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్ దాఖలు చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఒక్కో మండలంలో ఆరు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు నామినేషన్ కేంద్రాన్ని తహసీల్దార్ పరిశీలించారు.

నాయుడుపేట ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పంచాయతీ ఎన్నికలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏకగ్రీవం జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తక్కువగానే ఇక్కడ ఏకగ్రీవాలు జరిగాయని.. ప్రస్తుతం నామినేషన్లు జరుగుతున్న చోట ఏకగ్రీవాలపై దృష్టి పెట్టామన్నారు.

కడప జిల్లాలో..

రాజంపేట మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాజంపేట నియోజకవర్గంలోని 93 పంచాయతీల్లో నాలుగు పంచాయతీలకు కోర్టు ఆదేశాల కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 89 పంచాయతీలకు 41 క్లస్టర్ల ద్వారా నామినేషన్లను స్వీకరిస్తున్నారు. రాజంపేట మండలంలో 25 గ్రామ పంచాయతీలకు 11 క్లస్టర్ల ద్వారా నామినేషన్లు స్వీకరించారు. ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాలలో నామినేషన్ల క్లస్టర్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు రంజిత్ బాషా పరిశీలించారు. రాజంపేటలోని పలు కేంద్రాల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. తాళ్లపాకలో తెదేపా మద్దతు దారులు నామినేషన్ వేశారు.

అనంతపురం జిల్లాలో..

జిల్లాలోని శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు బుక్కరాయసముద్రం మండలంలో వైకాపా బలపరిచిన అభ్యర్థి ఒకరు, దండువారిపల్లి గ్రామ పంచాయతీకి సీపీఐ బలపరిచిన అభ్యర్థి ఒకరు, నార్పల మండలం గడ్డంనాగేపల్లి పంచాయతీలో వైకాపా అభ్యర్థి ఒకరు, శింగనమల మండలం పెరవలి గ్రామ పంచాయతీకి తెదేపా పార్టీ అభ్యర్థిగా ఒకరు, తరిమెల గ్రామ పంచాయతీలో వైకాపా అభ్యర్థిగా ఒకరు, పుట్లూరు మండలంలో మడుగుపల్లి గ్రామ పంచాయతీకి వైకాపా ఒకరు, సి వెంగన్నపల్లి గ్రామ పంచాయతీకి స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు, యల్లనూరు మండలంలో ఒక నామినేషన్ దాఖలయ్యాయి. నామినేషన్ కేంద్రాలను సీఐ విజయ్ భాస్కర్ గౌడ్ పరిశీలించి.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.

విశాఖ జిల్లాలో..

విశాఖ మన్యంలో నామినేషన్ల సందడి మొదలైంది. మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. తొలిరోజు అరకులోయ మండలంలోని పంచాయతీలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పద్మాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెదేపా బలపరిచిన అభ్యర్థిగా మహదేవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. మేళతాళాలతో గిరిజన సంప్రదాయ నృత్యప్రదర్శనలతో నామినేషన్ల కార్యక్రమం జరిగింది. ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల విజయం ఖాయమని మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

విజయనగరం జిల్లాలో..

గ్రామ పంచాయితీ ఎన్నికల మూడో విడతలో భాగంగా ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 8 వరకు విజయనగరం డివిజన్లోని 9 మండలాల్లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 12 న ఉపసంహరణ చేసుకునే అవకాశం కల్పించారు. అధికారులు ఫిబ్రవరి 17న.. 9 మండలాల పరిధిలో ఉన్న 244 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను చేపట్టనున్నారు.

విజయనగరం డివిజన్ లో శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపడుతున్నామంటున్నారు. విజయనగరం పట్టణ డీఎస్పీ అనిల్ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా స్పెషల్ పార్టీ సిబ్బందితో ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో..

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని 30 పంచాయతీలకు సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో కేంద్రాల వద్దకు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేసి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేపట్టిన్నట్టు సీఐ ప్రసాదరావు ఎస్సై కోటేశ్వర రావు తెలిపారు.

జిల్లాలోని పాలకొండ మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించడంతో గ్రామ పంచాయతీలు సందడిగా మారాయి. అన్నవరం, చిన్నమంగలాపురం, భాసూరులో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందుకోసం ఈ సారి సచివాలయం పరిధిలో పంచాయతీలకు ఒకే కేంద్రంలో నామినేషన్లు తీసుకునేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామాల నుంచి సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థులు కోలాహలంగా కేంద్రానికి చేరుకొని నామినేషన్లు దాఖలు చేశారు. కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ శంకర్ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:

'ఎన్నికల అధికారులపై చర్యలకు ఎస్ఈసీ అనుమతి తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.