రాష్ట్రంలో నాలుగు రోజుల్లో 90,50,052 కుటుంబాలకు రేషన్ పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. మూడో విడత రేషన్ పంపిణీ కొనసాగుతుందన్న ఆయన.. మూడో విడతలో 1,35,263 మెట్రిక్ టన్నుల బియ్యం.. 9,079 మెట్రిక్ టన్నుల కందిపప్పు పంపిణీ చేసినట్లు తెలిపారు. పోర్టబులిటీ ద్వారా 22,02,224 కుటుంబాలు రేషన్ తీసుకున్నాయని వివరించారు.
ఇదీ చూడండి..