తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద మాటూరు పేట గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ ఏటీఎం. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నంత పకడ్బందీ ప్రణాళికతో అర్ధరాత్రి వేళ ఇద్దరు దొంగలు... ఏటీఎంలోకి వచ్చారు. అందులో ఉన్న సీసీ కెమెరానే లక్ష్యంగా చేసుకుని ముందుగా దాన్ని బద్దలుకొట్టారు.
ఆ తర్వాత ఏటీఎం(ATM ROBBERY ATTEMPT) యంత్రాన్ని తెరిచేందుకు ఇద్దరు దొంగలు శాయశక్తులా ప్రయత్నించారు. వాళ్లిద్దరి వల్లా కాకపోవటం వల్ల విఫలయత్నమే అయ్యింది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరోనా వేళ జాగ్రత్తగా మాస్కులు ధరించి చోరీకి వచ్చిన కేటుగాళ్లు... ఏటీఎంలో ఉన్న మరో సీసీ కెమెరానg మాత్రం గుర్తించలేకపోయారు. చోరీ చేసేందుకు వచ్చి.... వీరు చేసిన తతంగమంతా ఆ సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.
కాసేపటికి రెండో సీసీ కెమెరాని గుర్తించిన కేటుగాళ్లు మెల్లిగా అక్కడ్నుంచి జారుకున్నారు. తెల్లవారిన తర్వాత విషయం గమనించిన ఏటీఎం నిర్వాహకులు... చోరీ విషయమై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: