మహారాష్ట్రలో తెలంగాణవాసుల కారుపై దొంగలు దాడి చేశారు. షిర్డీ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. కర్ణాటక సరిహద్దు వాసీ వద్ద కారుపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దొంగల నుంచి తప్పించుకునే క్రమంలో కారు బోల్తా పడి.. ఐదుగరికి గాయాలయ్యాయి.
ప్రయాణికుల నుంచి దొంగలు 8 తులాల బంగారం దోచుకెళ్లారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. బాదితులు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలానికి చెందినవారిగా గుర్తించారు. వీరిలో బండవేల్కిచర్లకు చెందిన ఉపాధ్యాయుడు రాములు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి రమేష్ ఉన్నారు.
- ఇదీ చూడండి: వాటిని అధిగమించే వాళ్లే నిజమైన ప్రేమికులు!