ETV Bharat / city

Accident in CC Footage: ముగ్గురు ప్రాణాలు తీసిన వేగం.. సీసీ కెమెరాలో దృశ్యాలు

Accident in cc footage: తొందరగా ఇంటికి వెళ్లాలనే వేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తెలంగాణలోని మేడ్చల్‌లో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో.. నవదంపతులతో పాటు, ఓ పాదచారి దుర్మరణం పాలైయ్యారు.

accident
accident
author img

By

Published : Sep 12, 2022, 4:24 PM IST

Accident in cc footage: తెలంగాణలోని మేడ్చల్​ పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన నవ దంపతులు సాయిరాజ్​, సారిక సొంత ఊరు నుంచి హైదరాబాద్​కు వస్తుండగా మేడ్చల్ బస్​ డిపో ఎదురుగా రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని వేగంగా ఢీ కొట్టారు. వేగానికి పాదచారి దూరంగా ఎగిరిపడి చనిపోగా.. రోడ్డుపై పడిపోయిన దంపతుల పైనుంచి వెనుక నుంచి ఇనుము లోడుతో వస్తున్న లారీ వెళ్లడంతో వారు అక్కడికిక్కడే మృతి చెందారు. మృతులు సాయిరాజ్, సారికకు ఈ ఎడాది మార్చిలో పెళ్లి అయ్యింది. వీరు వృత్తిరీత్యా హైదరాబాద్​లో ఉంటుండగా.. ఆదివారం సెలవు దినం కావటం సొంత ఊరిలో వినాయక నిమజ్జానికి వెళ్లి.. తిరిగి హైదరాబాద్​కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నవదంపతుల అకాల మరణంతో సొంత గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ముగ్గురు ప్రాణాలు తీసిన వేగం.. సీసీ కెమెరాలో దృశ్యాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.